Begin typing your search above and press return to search.

నేనా.. ‘బిగ్ బాస్’ లేడీని పెళ్లాడటమా?

By:  Tupaki Desk   |   9 Aug 2017 7:03 AM GMT
నేనా.. ‘బిగ్ బాస్’ లేడీని పెళ్లాడటమా?
X
మామూలుగా తనంతట తాను ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటాడు కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబు. ఈసారి మాత్రం అతడి ప్రమేయం లేకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ‘బిగ్ బాస్’ షోతో సూపర్ పాపులారిటీ సంపాదించి.. అనూహ్య రీతిలో హౌజ్ నుంచి బయటికి వచ్చేసిన ఒవియాను తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ శింబు ప్రకటన చేశాడన్న వార్త రెండు రోజుల పాటు కోలీవుడ్ ను కుదిపేసింది.

ఐతే ఈ ప్రచారం గట్టిగా జరుగుతుండటంతో శింబు అప్రమత్తం అయ్యాడు. తాను అలాంటి ప్రకటనేదీ చేయలేదని స్పష్టం చేశాడు. తన పేరిట తన ఒరిజినల్ అకౌంట్ తరహాలోనే ఒక ట్విట్టర్ ఖాతాను ఆరంభించి.. ‘ఒవియాను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధం’ అంటూ ట్వీట్ చేశారని.. అది ఫేక్ అకౌంట్ అని.. తన గురించి కావాలనే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని శింబు క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి వార్తల విషయంలో మీడియా కొంచెం సంయమనం పాటించాలని శింబు అన్నాడు.

ఒవియాను తాను పెళ్లాడతానని ఎక్కడా అనలేదని శింబు స్పష్టం చేశాడు. తనకు వ్యతిరేకంగా కుట్ర పూరితంగానే ఇలా చేశారని.. అలా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని.. ఐతే ఇంకోసారి ఇలా చేస్తే తాను జవాబిచ్చే తీరు మరోలా ఉంటుందని శింబు హెచ్చరికలు జారీ చేశాడు. తన అభిమానులు ఇలాంటి ఫేక్ ఐడీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శింబు హితవు పలికాడు.