Begin typing your search above and press return to search.

శింబు- త్రిష పెళ్లి... విరిగిన మ‌న‌సులు అతికేనా?

By:  Tupaki Desk   |   21 Oct 2020 6:50 AM GMT
శింబు- త్రిష పెళ్లి... విరిగిన మ‌న‌సులు అతికేనా?
X
ప్రేమ‌లో ప‌డ‌డం బ్రేక‌ప్ అవ్వ‌డం .. ఈరోజుల్లో చాలా కామ‌న్ థింగ్. అమ్మాయి అబ్బాయి తొలి చూపులోనో మ‌లి చూపులోనో లేక స్నేహం కుదిరాకో.. ఇంకేదైనా సీన్ లోనో ప్రేమ‌లో ప‌డిపోవ‌డం ఆన‌క గులాబీలు ఇచ్చి పుచ్చుకోవ‌డం బ‌హుమ‌తులు షేర్ చేసుకోవడం.. అటుపైనా ఒకే ఇంట్లో స‌హ‌జీవ‌నం .. వ‌గైరా వ‌గైరా మోడ్ర‌న్ లైఫ్ స్టైల్. ఇక కొంద‌రు గ‌య్స్ ఒక‌టికి మించిన ప్రేమాయ‌ణాల‌తో నిరంత‌రం గాళ్స్ న‌డుమ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఇక మ‌గువ‌ల వ‌ర‌కూ మ‌నసిస్తే నువ్వేరా! నువ్వు లేని నేను లేను రా!! అంటూ ప‌ట్టుబ‌ట్టి కూచుంటారు. ఇవ‌న్నీ బోయ్స్ గాయ్స్ అపుడో ఎపుడో ఎక‌డో అల‌వాటు ప‌డే ఉంటారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోంది అంటే.. త‌మిళ యంగ్ హీరో శింబు పై వ‌చ్చిన‌న్ని గాసిప్పులు .. ప్రేమాయ‌ణం రూమ‌ర్లు ఇంకెవ‌రిపైనా వ‌చ్చి ఉండ‌వేమో! ఒక‌రికి మించి మ‌గువ‌ల్ని ప్రేమించాడు. కెరీర్ ఆరంభ‌మే న‌య‌న‌తార‌.. ఆ త‌ర్వాత త్రిష‌తోనూ ఎఫైర్ అంటూ ప్ర‌చార‌మైంది. అటుపై హ‌న్సిక‌తోనూ డీప్ ల‌వ్ లో సింక్ అయ్యాడు. ఇవ‌న్నీ బ్రేక‌ప్ ల‌వ్ స్టోరీలుగా మిగిలిపోయాయి. అత‌డి కెరీర్ డైల‌మా కార‌ణాలు ఇవేన‌ని చెబుతుంటారు. ఇక త్రిష కు నిశ్చితార్థం జ‌రిగి ఆ పెళ్లి ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఇవ‌న్నీ ఫ్లాష్ బ్యాక్ సంగ‌తులు అనుకుంటే.. ఇప్పుడు త్రిష‌తో శింబు ల‌వ్ లో ప‌డ్డాడ‌ని ఆ ఇద్ద‌రూ పెళ్లాడుకోబోతున్నార‌ని సాగుతున్న ప్ర‌చారం మ‌రో ఎత్తు. ఆ ఇద్ద‌రికీ బ్రేక‌ప్ స్టోరీలు ఉన్నాయి. క‌ల‌త‌లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఇద్ద‌రూ క‌ల‌వ‌బోతున్నారా? పెళ్లాడుకోబోతున్నారా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ కోలీవుడ్ వ‌ర్గాల్లో సాగుతోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. శింబు అక్టోబర్ 22 న సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నాడ‌ట‌. ఇప్పటి వరకు అతను సోషల్ మీడియాలకు ఎందుక‌నో దూరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్న‌ట్టుండి మ‌న‌సు మార్చుకున్నాడు. అతని సోషల్ మీడియా అరంగేట్రం గురించి వివరాలను ప్ర‌చార‌ బృందం ప్రకటించింది.అంతేకాదు.. తన వివాహ వివరాలను ప్రకటించడానికి సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నాడని ఊహాగానాలు మొద‌ల‌వ్వ‌డ‌మే ఇక్క‌డ మ‌రో ట్విస్టు.

త్రిష-శింబు ఇప్పుడు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నార‌ని.. పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారని ఒక‌టే ప్ర‌చారం హోరెత్తిపోతోంది. తాజా పుకార్ల పై నిజానిజాలు నిగ్గు తేలుస్తూ స్పష్టత పొందాలని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మ‌రి అన్నిటికీ అక్క‌డ స‌మాధానం దొరుకుతుందా? ఇంత‌కీ ఆ జంట పెళ్లితో ఒక‌ట‌వుతోందా? విరిగిన మ‌నసులు తిరిగి సాంత్వ‌న పొందుతాయా? అంటూ ఒక‌టే గుస‌గుస‌లు వేడెక్కించేస్తున్నాయ్.