Begin typing your search above and press return to search.
పోయిన పరువుని టెంపర్ తో రాబడతాడా
By: Tupaki Desk | 7 March 2016 1:30 PM GMTఇప్పుడు శింబు కోలీవుడ్ లో కాంట్రవర్షియల్ హీరో అయిపోయాడు. సాధారణంగానే అమ్మాయిలతో ఎఫైర్స్ తో జనాల నోళ్లలోను - మీడియాలోను నానుతూ ఉండే శింబు.. ఈ మధ్య బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకున్నాడు. తనే బూతులతో పాట పాడి, ఆ బూతులు వినిపించే ప్లేస్ లో బీప్ సౌండ్ పెట్టిన సాంగ్.. ఇతడి పరువును బజారుకి ఈడ్చింది. పోలీసులు వెతకడం - కోర్టు నోటీసులు ఇవ్వడం - చివరకు లొంగిపోవడం వరకూ ఈ స్టోరీ కంటిన్యూ అయిపోయింది.
ఇలా తను మహిళా సమాజంలో పోగొట్టుకున్న పరువును.. ఓ మంచి సినిమాతో తిరిగి రాబట్టుకునేందుకు స్కెచ్ వేశాడు శింబు. గతేడాది టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది ఎన్టీఆర్ టెంపర్ మూవీ. ఓ అమ్మాయికి జరిగిన అన్యాయానికి గాను ఆమెకు న్యాయం చేసేందుకు ఉరికంబం ఎక్కడానికి సిద్ధమయ్యే హీరో కథ ఇది. ఇప్పుడీ సినిమాను శింబు రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే టెంపర్ రైట్స్ ను మైకేల్ రాయప్పన్ కొనుగోలు చేయగా.. వాలు ఫేం విజయ్ చందర్.. కోలీవుడ్ టెంపర్ వెర్షన్ ని డైరెక్ట్ చేయనున్నాడట. ఈ సినిమా ద్వారా మహిళల పట్ల తన ఉద్దేశ్యాన్ని చెప్పాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇందుకోసం మెయిన్ ప్లాట్ ను అలాగే ఉంచి.. కొన్ని సీన్లను మార్చాలని డిసైడ్ అయ్యాడట డైరెక్టర్. శింబు ఆలోచన వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.