Begin typing your search above and press return to search.
ప్చ్.. ప్రతిరోజూ ఓ కొత్త కథానాయిక
By: Tupaki Desk | 30 Oct 2015 6:00 AM GMTఅలనాటి మేటి నాయిక సిమ్రన్ ని తెలుగు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. నిన్నా కుట్టేసినాది. .. మొన్నా కుట్టేసినాది .. గండు చీమ. అది కుడుతూ కుడుతూ ఉంటే ... అంటూ తెలుగు యువత గుండెల్ని ఆరోజుల్లోనే తెగ కుట్టేసింది ఈ చెన్నయ్ చంద్రం. మేటి డ్యాన్సర్ గా - గొప్ప అభినయం ఉన్న నాయికగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే సిమ్రన్ తిరిగి రీఎంట్రీ ఇస్తోంది అనగానే ఎంతో ఇంట్రెస్ట్ క్రియేటైంది.
సిమ్రన్ ఇటీవలి కాలంలో తమిళంలో బుల్లితెర షోలు చేసింది మినహా పెద్దగా వెండితెర యాక్టివిటీస్ చేసిందేం లేదు. ఇన్నాళ్టికి తిరిగి తన పూర్వ రూపం కోసం ఎంతో శ్రమించి సన్నజాజిలా తయారై తిరిగి వెండితెరకోసం ముఖానికి రంగేసుకునేందుకు రెడీ అవుతోంది. గౌరీ శంకర్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్సన్ సినిమాలో నటించేందుకు సంతకం చేసిందని మనకు తెలిసిందే. రీఎంట్రీ సందర్భంగా నేటి జనరేషన్ నాయికల గురించి మాట్లాడుతూ.. అప్పటికి ఇప్పటికి చాలా మారింది. నా రోజుల్లో కాంపిటీషన్ తక్కువ. కానీ ఇప్పుడలా కాదు. ప్రతి రోజు ఓ కథానాయిక పరిచయం అవుతోంది. అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే సేమ్ టైమ్ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువనాయికలు నిలదొక్కుకోవడం అంత సులువేం కాదు. తీవ్రమైన పోటీని తట్టుకుని ఎదగాలి... అని చెప్పింది.
ఒకప్పుడు టెక్నాలజీ వేరు. ఇప్పటి టెక్నాలజీ వేరు. ఇప్పుడొస్తున్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్‌డ్ గా ఉంది. ఇది మంచికే అంటూ చెప్పింది. సో త్వరలోనే తెలుగు - తమిళ్ ద్విభాషా చిత్రంలో సిమ్రన్ ని చూడబోతున్నాం అన్నమాట!