Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్: బోల్డ్ కి అమ్మ మొగుడు
By: Tupaki Desk | 3 April 2020 8:50 AM GMTసినిమాల్లో బోల్డ్ కంటెంట్ పెరగగానే సంప్రదాయ వాదుల్లో అసహనం పెరిగింది. విపరీతంగా విమర్శలు కూడా వచ్చాయి. కానీ బోల్డ్ కంటెంట్ కు ప్రేక్షకుల్లో ఆదరణ పెరగడం.. పెద్దవారి నీతి సూక్తులకు వ్యతిరేకంగా ఈ అడల్ట్ కంటెంట్ సినిమాలు కాసుల వర్షం కురిపిస్తూ ఉండడంతో బోల్డ్ సినిమాల పరంపర మొదలు అయింది. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ ల హవా మొదలైన తర్వాత బూతు కి మహా సపోర్టు దొరికింది. నిజానికి బూతే ఇప్పుడు ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ కు బ్రహ్మాస్త్రం గా మారింది. స్టోరీ ఏదైనా కానివ్వండి.. అందులో బూతు మిక్స్ చేసి..4 ఫసక్ సీన్లను జోడించి.. వాటికి ఎక్కువ అర్థం అవసరం లేకుండా బూతు ధ్వనించే నాలుగు డైలాగులను చూపిస్తే చాలు ఒక వెబ్ సిరీస్ రెడీ అయిపోతుంది.
ఎలాగూ మన దేశం సంప్రదాయకంగా సెక్స్.. బూతు.. రొమాన్స్.. ఈ పదాలకు దూరంగా ఉంటామని అంటూనే అదేపనిగా వాటిపై దృష్టి పెట్టే సమాజం. లేకపోతే జనాభా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి? సరిగ్గా ఈ విషయాన్నే ఓ టి టి ప్లాట్ఫామ్స్ వారు గ్రహించారు. బూతు కంటెంట్ తో ప్రేక్షకుల పైకి దండెత్తుతున్నారు. తాజాగా ఈ కోవలో అల్లు వారి ఓ టి టి ప్లాట్ ఫామ్ ఆహా కూడా జాయిన్ అయింది. ఈ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానున్న 'సిన్'' అనే వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది.
ట్రైలర్ విషయానికి వస్తే సిగ్గరి అయిన భార్య.. సెక్స్ కోసం పరితపించి పోయే మొగుడు.. ఇది స్థూలంగా కథ. భార్య వద్దు అంటూ ఉంటుంది.. మొగుడు అదేపనిగా కావాలి అంటూ ఉంటాడు. భార్య ఇష్టాయిష్టాలతో పని లేకుండా.. బలవంతంగా భార్య శరీరాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే హీరోగారి కంపెనీలో మరో కత్తిలాంటి లేడీ ఎంట్రీ ఇస్తుంది.. ఆ లేడీ కి మన హీరో పై మనసవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. చూస్తుంటేనే ఇది మసాలా స్టోరీ అనే విషయం అర్థమవుతుంది కదా. సహజంగా టైటిల్ కి కంటెంట్ కి ఎప్పుడు లింక్ కుదరదు. కానీ ఈ వెబ్ సిరీస్ లో ఉండే కంటెంట్ కి టైటిల్ వందశాతం న్యాయం చేస్తుంది. ఆలస్యం ఎందుకు.. ట్రైలర్ చూసేయండి.