Begin typing your search above and press return to search.

అప్పటి నుంచి అన్నయ్యకి కాస్త తేడా చేసింది: పరుచూరి గోపాలకృష్ణ

By:  Tupaki Desk   |   1 April 2022 11:30 AM GMT
అప్పటి నుంచి అన్నయ్యకి కాస్త తేడా చేసింది: పరుచూరి గోపాలకృష్ణ
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కి గల ప్రత్యేకమైన స్థానాన్ని గురించి చెప్పుకోవలసిన పనిలేదు. సుదీర్ఘ కాలంగా వాళ్లు తమ ఆలోచనలను .. అభిప్రాయాలను కలిసి పంచుకున్నారు. 300 సినిమాలకి పైగా కలిసి పనిచేస్తూ ఎన్నో విజయాలను అందుకున్నారు. అలాంటి పరిచూరి సోదరులలో ఒకరైన వెంకటేశ్వరరావును దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కలుసుకున్నారు. ఆ సమయంలో వెంకటేశ్వరరావుతో తీసుకున్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో పరుచూరి వెంకటేశ్వరరావుని చూసిన వాళ్లంతా "అయ్యో అలా అయిపోయారేంటి?" అనుకున్నారు.

తాజాగా ఆ విషయాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ .. "ముందుగా అందరికీ ఒక మాట చెబుతున్నాను .. అన్నయ్య బాగానే ఉన్నారు. 2017లో మేము ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు ఆయనకి కాస్త తేడా చేసింది. అక్కడి నుంచి రాగానే ఆయన అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు ఆయనకి కొన్ని ఆహార నియమాలు చెప్పారు. ఆ తరువాత ఆయన 10 కేజీలు తగ్గారు .. అందువలన ఆయన అలా కనిపిస్తున్నారు. ఆయన మేథస్సు అలాగే ఉంది .. నేను కాల్ చేసినప్పుడల్లా ఆయన చాలా చక్కగా మాట్లాడుతున్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు స్క్రీన్ ప్లే విషయంలో మాస్టర్ లాంటివారు. డైలాగ్ ఎలా ఉంటే పేలుతుందో .. సీన్ ఎలా ఉంటే పండుతుందో .. ఆర్డర్ ఎక్కడ తేడా కొడుతుందో ముందుగానే ఆయన చెప్పేవారు. అంతగా ఆయనకి ఆడియన్స్ .. ఆడిటోరియం పల్స్ తెలుసు.

చివరి నిమిషాల్లో ఆయన చేసిన మార్పులు .. చేర్పులు ఆయా సినిమాలకు ఎంతో హెల్ప్ అయ్యాయి. మాస్ సినిమాల దగ్గర .. క్లాస్ సినిమాల దగ్గర మా ఇద్దరి మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. క్లాస్ సినిమాల్లో ఆయన జడ్జిమెంట్ కరెక్టుగా ఉంటే, మాస్ సినిమాల్లో నా జడ్జిమెంట్ కరెక్టుగా ఉండేది.

సరే .. ఫైనల్ గా నేను చెప్పేదేమిటంటే .. అన్నయ్య బాగున్నారు. జుట్టుకు కలర్ వస్తే కాస్త మంచిగా కనిపించేవారు. నేను జయంత్ తో కూడా అన్నాను .. ఎందుకయ్యా అలాంటి ఫొటో పంపించావు .. ఆయన ఎలా ఉన్నాడనేది మన కంటితో చూడొచ్చుగా అని.

80 ఏళ్లు వచ్చిన వాళ్లు ఎలా ఉంటారు? అంటూ కొంతమంది అభిమానులు స్పందించారు. నిజమే వయసు వస్తుంటే మన శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. వాటిని స్వీకరించవలసిందే. ఏదైనా అభిమానులు ఎవరూ కంగారు పడవలసిన పనిలేదు .. అన్నయ్య బాగున్నాడని చెప్పడానికే మీ ముందుకు వచ్చాను" అన్నారు.