Begin typing your search above and press return to search.
రజనీ ఎవరి ఫ్యాన్ అయిపోయారో తెలుసా?
By: Tupaki Desk | 20 Aug 2016 5:39 AM GMTమామూలుగా నేను రజనీకాంత్ ఫ్యాన్.. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. నేను విజయ్ ఫ్యాన్.. నేను రణవీర్ సింగ్ ఫ్యాన్ అంటూ చెప్పడం మనం వింటూనే ఉంటాం. అయితే ఈ సూపర్ స్టార్లు కూడా నార్మల్ మనుషులేగా. వీరు ఎవరి ఫ్యాన్ అయ్యుంటారు? అనేదే ఎప్పుడూ ఆసక్తి రేకెత్తించే ప్రశ్న. ఇప్పుడు అలాంటి ఓ ప్రశ్నను అడగకుండానే ఇండియా అంతా అభిమానించే సూపర్ స్టార్ మనకు ఒక సమాధానం చెప్పారు.
''హ్యాట్సాఫ్ టు యు పివి.సింధు. ఇప్పుడు నేను నీకు అత్యంత పెద్ద ఫ్యాన్ అయిపోయాను. కంగ్రాట్యులేషన్స్'' అంటూ ట్వీట్ వేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ ఒక్క దెబ్బతో ఇండియా అంతా రజనీకాంత్ పేరు మారుమోగిపోతోంది. ఆయన ట్వీట్ వేసిన నిమిషాల్లోనూ మీడియా అంతట రజనీ ఎవరి ఫ్యానో తెలుసా అంటూ హాట్ న్యూస్ రన్ అయ్యింది. దేశానికి తొలిసారిగా సిల్వర్ మెడల్ తెచ్చిన మహిళగా పి.వి.సింధు ఇప్పుడు చరిత్ర సృష్టించింది. భారతీయ ఖ్యాతిని అత్యుతన్నత శిఖరాల మీద నిలబెట్టింది. రియో 2016 ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ ఫైనల్ లోకి ప్రవేశించి కోట్లమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది. అలాంటి కోట్ల హృదయాల్లో రజనీకాంత్ హృదయం కూడా ఉండటం విశేషమే.
ఇకపోతే టాలీవుడ్ అంతా ఆల్రెడీ సింధూను తన ప్రియమైన ప్రేమ ట్వీట్లతో ముంచెత్తేసింది కూడా. తెలంగాణ మంత్రి కె.టి.ఆర్ ఆమె కోసం హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చేయాల్సిన ఘనమైన ఏర్పాట్ల గురించి ఆల్రెడీ అధికారులతో చర్చిస్తున్నారట.