Begin typing your search above and press return to search.
మహేష్ టెక్నీషియన్.. సింగం-3 రీమేక్
By: Tupaki Desk | 9 Aug 2017 11:03 AM GMTసినీ రంగంలో పని చేసే ఏ టెక్నీషియన్ కు అయినా సరే.. అంతిమంగా దర్శకుడు కావాలన్నది లక్ష్యంగా ఉంటుంది. రచయితలు.. డ్యాన్స్ మాస్టర్లు.. ఫైట్ మాస్టర్లు.. సంగీత దర్శకులు.. ఎడిటర్లు.. సినిమాటోగ్రాఫర్లు.. ఇలా వేరే క్రాఫ్ట్స్ కు చెందిన ఎంతోమంది మెగా ఫోన్ పట్టినవాళ్లే. భారత దేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లలో ఒకడైన రవి.కె.చంద్రన్ సైతం ఇప్పటికే ఒకసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అతను తమిళంలో జీవా హీరోగా ‘యాన్’ అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి.. రవిని నిరాశకు గురి చేసింది.
ఐతే దర్శకత్వ ప్రయత్నాల్ని అంతటితో ఆపేయట్లేదు రవి.కె.చంద్రన్. ఇప్పుడాయన ఓ రీమేక్ మూవీ ద్వారా మరోసారి దర్శకుడిగా తన ప్రయత్నాన్ని కొనసాగించబోతున్నాడు. సూర్య నటించిన ద్విభాషా చిత్రం ‘సింగం-3’ ఆధారంగా హిందీలో సినిమా చేయబోతున్నాడట రవి. సీనియర్ హీరో సన్నీడియోల్ ఇందులో హీరోగా నటిస్తాడట. సన్నీ ఇప్పటికే ‘సింగం-3’ చూసి ఇంప్రెస్ అయ్యాడట. బాలీవుడ్ రచయితల సహకారంతో రీమేక్ స్క్రిప్టు రెడీ చేయిస్తున్నాడట రవి. ఈ ఏడాది మణిరత్నం సినిమా ‘చెలియా’తో ఛాయాగ్రాహకుడిగా గొప్ప పేరు సంపాదించాడు రవి.కె.చంద్రన్. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండటం విశేషం. ఈ సినిమా పని పూర్తయ్యాక ‘సింగం-2’ రీమేక్ మొదలుపెడతాడట రవి.కె.చంద్రన్. ‘సింగం’ సిరీస్ లో తొలి సినిమా కూడా హిందీలో రీమేక్ అయి సూపర్ హిట్టయింది.