Begin typing your search above and press return to search.

మీసం తిప్పే సింగం వైజాగ్‌ వస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 Nov 2015 4:51 AM GMT
మీసం తిప్పే సింగం వైజాగ్‌ వస్తున్నాడు
X
సింగం అంటే సూర్య‌. సూర్య అంటే సింగం!! అంత‌గా పాపుల‌ర్ అయ్యాడు సూర్య . ఉగ్ర న‌ర‌సింహుడికి మారు రూపంగా సూర్య ప్ర‌ద‌ర్శించిన‌ అభిన‌యం అటు తంబీల‌కు, ఇటు తెలుగువారికి బాగా న‌చ్చింది. అందుకే సింగం సిరీస్ సూప‌ర్‌ డూప‌ర్ హిట్ సిరీస్‌ గా అత‌డికి పేరు తెచ్చింది. కోర‌మీసం తిప్పుతూ జ‌బ్బ‌లు చ‌రిచి - గూండాలు - రౌడీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించే పోలీస్ అధికారిగా సూర్య అదిరిపోయే పెర్ఫామెన్స్‌ తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సిరీస్‌ కి కోలీవుడ్ స్పీడ్ డైరెక్ట‌ర్‌ హ‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడో పార్ట్ షూటింగుకి రెడీ చేస్తున్నారిప్పుడు. సింగం -3 షూటింగు కోసం చిత్ర‌యూనిట్ రెడీ అవుతోంది.

డిసెంబ‌ర్ లో విశాఖ‌ప‌ట్నంలో షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఇక్క‌డ సూర్య స‌హా కీల‌క న‌టీన‌టుల‌పై మొద‌టి షెడ్యూల్‌ ని చిత్రీక‌రించ‌నున్నారు. నెల‌రోజుల పాటు సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ ఇది. ఇందులో అనుష్క‌ - శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సింగం సిరీస్‌ లో సూర్య ఉగ్ర న‌ర‌సింహుడిగా క‌నిపిస్తాడు కాబ‌ట్టి అందుకు సింబాలిక్‌ గా అత‌డు కోర‌మీసంతో క‌నిపించాడు. మొద‌టి రెండు భాగాల్లో ఆ రూపురేఖ‌ల‌తోనే ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు మూడో పార్ట్ కోసం కూడా మీసం మెలేసేందుకు రెడీ అవుతున్నాడు. గ‌త కొంత కాలంగా పొడ‌వాటి కోర‌మీసం పెంచేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నాడ‌ని టాక్‌. మీసం తిప్పే సింగం టేకాఫ్‌ కి రెడీ.