Begin typing your search above and press return to search.
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన 'సింగం' నటుడు..!
By: Tupaki Desk | 30 Sep 2021 4:45 AM GMTసింగం' సినిమాలో విలన్ గా నటించిన నైజీరియన్ నటుడు చాక్ విమ్ మాల్విన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 29, బుధవారం బెంగళూరులో హెచ్‌బిఆర్ లేఅవుట్‌లో ఉన్న ఒక భవనంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా.. అతడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వారిలో కాలేజ్ స్టూడెంట్స్ మరియు వ్యాపారవేత్తలు ఉన్నారని తెలుస్తోంది.
చాక్ విమ్ మాల్విన్ నుంచి 15 గ్రాముల ఎండీఎంఓ - రూ.8 లక్షలు విలువ చేసే మత్తు పదార్థాలు - రూ .7 లక్షల విలువైన 250 ఎంఎల్ హ్యాష్ ఆయిల్ సహా కొన్ని మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ నటుడు పై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 లోని పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశామని బెంగుళూరు పోలీసులు వెల్లడించారు
'సింగం' చిత్రంలో చాక్ విమ్ మాల్విన్ డ్రగ్ స్మగ్లర్ పాత్రలో కనిపించాడు. మెయిన్ విలన్ డ్యానీ ముఠాలో మాల్విన్ కూడా ఉంటాడు. సినిమాలో డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్ట్ చేయబడిన చాక్ విమ్.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అదే కారణంతో అరెస్ట్ కావడం గమనార్హం. అందుకే ఇప్పుడు ఈ సంఘటన నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అందరూ ఈ న్యూస్ ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రలేకపోవడంతో చాక్ విమ్ మాల్విన్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చాక్విమ్ నైజీరియన్ సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ మరియు కన్నడ సినిమాలలో నటించాడు. 'సింగం' 'విశ్వరూపం' 'అన్నా బంద్' 'దిల్ వాలే' 'జంబూ సవారీ' 'పరమాత్మ' వంటి చిత్రాల్లో అతని చిన్న పాత్రలలో నటించారు.
చాక్ విమ్ మాల్విన్ మెడికల్ వీసాతో భారతదేశంలో ఉన్నారని.. ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో 2 నెలల శిక్షణ తీసుకున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతనిపై నమోదు చేసిన డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.