Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ను కలిసి ఎమోషనల్ అయిన బేబీ

By:  Tupaki Desk   |   26 Nov 2018 5:40 AM GMT
మెగాస్టార్ ను కలిసి ఎమోషనల్ అయిన బేబీ
X
సోషల్ మీడియావల్ల అంతా చెడే జరుగుతుందని అనుకునే వారికి ఇది చెంపపెట్టు. ఎందుకంటే ప్రతి నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే సోషల్ మీడియాకు కూడా రెండు పార్శ్వాలు ఉన్నాయి. గతంలో సంజీవ్ శ్రీవాత్సవ అనే ఒక సూపర్ డాన్సర్ అంకుల్ బాలీవుడ్ హీరో గోవిందా పాటకు ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో డ్యాన్సు వేయడంతో ఆయనను ఇండియా వైడ్ 'డాన్సింగ్ అంకుల్' గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఏకంగా బాలీవుడ్ హీరోలానే కలిసేలా చేసింది.

తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటిదే మరో సంఘటన జరగడం విశేషం. ఈమధ్య బేబీ అనే ఒక లేడీ 'ప్రేమికుడు' సినిమాలోని 'ఓ చెలియా నా ప్రియ సఖియా' అనే పాట పాడడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఆ వీడియో ఏఆర్ రెహమాన్ వరకూ చేరడంతో ఆమెను అభినందిస్తూ ఆమె వీడియోను షేర్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయింది. పొలం పనులు చేసుకుంటూ జీవించే 40 సంవత్సరాల బేబీ సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామం. ఇప్పటికే ఈమెను సింగర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని సీనియర్ సంగీత దర్శకుడు కోటి మాటిచ్చారట.

ఇదిలా ఉంటే బేబీ సంగతి తెలుసుకున్న చిరంజీవి కోటి కి చెప్పి మరీ ఆవిడను ఇంటికి పిలిపించారట. చిరంజీవి దంపతులు ఆమెను ప్రత్యేకంగా కలిసి మరీ అభినందించారు. ఇందులో విశేషం ఏంటంటే ఆమె చిరంజీవికి పెద్ద ఫ్యాన్ కావడం. చిరంజీవిని చూడగానే ఎమోషనల్ అయిన బేబీ అయన కాళ్ళపై పడి నమస్కరించిందట. మమ్మల్ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. ఈ జన్మకిది చాలని చెప్పిందట. చిరంజీవి కూడా మీరు మట్టిలో మాణిక్యం అని.. మీ గొంతులో ప్రత్యేకత ఉందని.. మీకు ఫిలిం ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉందని అభినందించారట. ఈ మీటింగ్ ను అరేంజ్ చేసిన కోటి కూడా ఆమెను ప్రశంసించారట.