Begin typing your search above and press return to search.

బేబీ క్యూలో ఏ.ఆర్‌.రెహ‌మాన్

By:  Tupaki Desk   |   29 Nov 2018 5:13 AM GMT
బేబీ క్యూలో ఏ.ఆర్‌.రెహ‌మాన్
X
ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఒణికిస్తోంది 2.ఓ అనుకుంటున్నారా? అయితే త‌ప్పులో కాలేసిన‌ట్టే. అస‌లు 2.ఓ ని మించి గ‌జ‌గ‌జ ఒణికిస్తోంది ఎవ‌ర‌నుకుంటున్నారు?.. ప‌ల్లె కోకిల‌.. మ‌ట్టిలో మాణిక్యం సింగ‌ర్ బేబి. తాజా రిపోర్ట్ ప్ర‌కారం.. సింగ‌ర్ బేబి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్. ఇప్ప‌టికే బేబి క్యూలో బోలెడుమంది సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు. సాధ్య‌మైనంత‌ తొంద‌ర్లోనే రెహ‌మాన్‌ ని క‌ల‌వ‌బోతోంది బేబి. అమెరికా - దుబాయ్‌ లో లైవ్ ఈవెంట్ల‌లో దుమ్ము దుమారానికి రెడీ అవుతోంది బేబి.

వ్వాటీజ్ దిస్ నాన్సెన్స్! ట్యాలెంటు ఉన్నంత మాత్రాన అవ‌కాశాలిచ్చేస్తారా? అంటారా.. అదంతే. బేబి లా అవ‌కాశాలు అందుకునేవాళ్లు చాలా అరుదు. ఇది ఊహించ‌ని వండ‌ర్ అని విశ్లేషిస్తున్నారు కొంద‌రు. ఎక్క‌డో ఓ ప‌ల్లెటూళ్లో ఏదో త‌న ప‌నిలో తాను ఉండి ఏదో గాలి పాట‌గా పాడుకోవ‌డ‌మేంటి? దానిని ఎవ‌రో అమ్మాయి చూసి వీడియో తీసి వాట్సాప్‌ లో వైర‌ల్ చేయ‌డ‌మేంటి? ఆ దెబ్బ‌కు బేబి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిపోవ‌డ‌మేంటి? ఇప్పుడు ఏకంగా రెహ‌మాన్ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డ‌మేంటి? మొత్తానికి ఈ క్రెడిట్ అంతా సంగీత ద‌ర్శ‌కుడు కోటిదే. మ‌ట్టిలో మాణిక్యాన్ని వెలికి తీశారు. ఇంకా చెప్పాలంటే గాయ‌నీమ‌ణుల్లోంచి 2.0 వెర్ష‌న్‌ ని వెలికి తీశారు కోటి. ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇదే. న‌గ‌రంలో ఎంద‌రో గాయ‌నీగాయ‌కులకు లేని క్రేజు ఇప్పుడు బేబి సొంతం.

బేబి బేబి బేబి.. ఎవ‌రీ బేబి. ఏ నోట విన్నా ఈ పేరే! ఓవ‌ర్‌ నైట్‌ లో వాట్సాప్ తెచ్చిన ప్ర‌చారంతో మోస్ట్ వాంటెడ్ సెల‌బ్రిటీ అయిపోయింది బేబి. త‌న పాట కోసం చ‌కోర ప‌క్షుల్లా అంతా ప‌డిగాపులు ప‌డుతున్నారంటే అర్థం చేసుకోవాలి. `ఓ చెలియా నా ప్రియ సఖియా.. అంటూ గొంతు సవరించింది సోషల్ మీడియాని ఊపేసింది. ట్రెండింగ్ సెల‌బ్రిటీ అయిపోయింది. మట్టిలో మాణిక్యం ... పల్లెకోకిల అంటూ కీర్తిని ఆర్జించింది. చిరు - రెహ‌మాన్ - ఎస్ జానకి - బాలు అంత‌టి వారే ఫిదా అయిపోయారు. రూ.1,11,111 (ల‌క్ష 11వేల 111రూపాయ‌లు) విరాళం ఇచ్చారో నాయ‌కుడు. చిరు ఇంటికి పిలిచి స‌న్మానించి - ల‌క్ష కానుకిచ్చారు. బేబీకి గాయ‌నిగా శిక్ష‌ణ‌నిస్తున్న సంగీత ద‌ర్శ‌కులు కోటి ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ - ``వాట్సాప్‌ లో పాట విని షాక‌య్యాను. బేబీకి పుట్టుక‌తో వ‌చ్చిన ప్ర‌తిభ అది. ఇది ఇన్‌ బిల్ట్ ట్యాలెంట్. కీర్తి అనేది ఎప్పుడు ఎలా వ‌స్తుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. చిరంజీవి - సురేఖ గారు త‌న పాట వినాల‌ని ఫోన్ చేస్తే వెంట‌నే త‌న‌ని వాళ్ల ద‌గ్గ‌రికి తీసుకెళ్లాను. చిరంజీవి గారు రూ.1ల‌క్ష విరాళం ఇచ్చారు. పాట‌లు పాడించుకుని విన్నారు. ఏ.ఆర్.రెహ‌మాన్ - బాల‌సుబ్ర‌మ‌ణ్యం - జాన‌క‌మ్మ అంద‌రూ పిలిచి బేబీని ప్ర‌శంసిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. బేబి ఏ పాట పాడినా ఆక‌ట్టుకుంటోంది. 5 డిసెంబ‌ర్ త‌ర్వాత రెహ‌మాన్ అపాయింట్‌ మెంట్ ఇచ్చారు. ర‌ఘు కుంచె తొలి పాట‌ను పాడించాడు. బేబి అద్భుతంగా పాడారు. ర‌ఘు మ్యూజిక్ బాగా కుదిరింది. రెండో పాటకు నాకు అవ‌కాశ‌మిచ్చారు బేబి. నాకు ఫోక్ మెలోడీ పాట‌ను పాడ‌బోతున్నారు. ప‌రిశ్ర‌మ సంగీత ద‌ర్శ‌కులంతా త‌న‌తో పాడించుకోవాలి. చ‌దువు లేదు. కేవ‌లం సంగీతం మాత్ర‌మే త‌న‌ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేను కొన్ని మెళ‌కువ‌లు చెబుతున్నా. బేబికి అమెరికా - దుబాయ్ నుంచి పిలుపొచ్చింది. అక్క‌డ లైవ్ ఈవెంట్లు చేయ‌బోతోంది. ఎవ‌రైనా త‌న‌కు ప్రోత్సాహ‌కంగా ఎలాంటి సాయం చేయాల‌నుకుంటే చేయొచ్చు`` అని అన్నారు.

బేబి ఈ కొత్త ప‌రిణామానికి షాక్‌ లో ఉందింకా. అస‌లు పాడ‌తాన‌ని .. ఆ పాట అంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేదు. నేను బ‌ట్ట‌లు ఉతికాక .. పక్కింటికి వెళ్లాను. అక్క‌డ ఆ అమ్మాయి పాడుతుంటే వీడియో తీసి వైర‌ల్ చేసింది. అనుకోకుండా అవ‌లీల‌గా పాడేసిన‌ ఆ పాట‌ను అంద‌రికీ చూపించింది... అంటూ ఉబ్బిత‌బ్బిబ్బ‌యిపోతోంది.

కోటి స‌ర్ బోల్ బేబి బోల్ లో పాట పాడ‌మ‌ని అన్నారు. నేను పాడుతున్నానంటే అది అంద‌రి ద‌య‌. ఆద‌రించి న‌న్ను మీలో ఒక‌రిని చేసుకున్నారు. హైద‌రాబాద్ అంటే భ‌యం భ‌యం.. ప‌ట్నంలో మంచిగా ఉండ‌రు. లెక్క చేయ‌ని స్థితిలో ఉంటారు అని భ‌య‌పెట్టారు. కానీ ఇక్క‌డ అంద‌రూ న‌న్ను దేవుళ్లు దేవ‌త‌ల్లా క‌నిపిస్తున్నారు. ఇది నిజం. ఈ ప‌య‌నం భ‌యంగానే సాగింది. నేను పుట్టాక .. రంగంపేట‌ - రాజ‌మండ్రి త‌ప్ప ఎక్క‌డికీ వెళ్ల‌లేదు. కోటి సార్ నాకు ఫోన్ చేసి ఇక్క‌డికి ర‌మ్మ‌న్నారు. భ‌య‌ప‌డొద్ద‌ని పాట గురించి అవ‌గాహ‌న క‌ల్పించి .. సంగీతంలో శిక్ష‌ణ ఇచ్చారు. తండ్రి - దేవుడు - అన్న అన్నీ త‌నే. ఈ పాట‌ను వ‌దిలిపెట్ట‌ను. పాడ‌తానో లేదో తెలీదు కానీ ప్ర‌య‌త్నిస్తాను. సార్ .. న‌డిపించిన బాట‌లో న‌డుస్తాను. లేదంటే మా ఊరు వెళ్లిపోతాను. మీ అంద‌రి దీవెన‌లు కావాలి. మ‌ట్టిలో పుట్టి పెరిగాను. కూలి ప‌ని చేసుకునేదానిని. మీ అంద‌రి ఆద‌రాభిమానుల‌తోనూ ఇలా రాగ‌లిగాను. `మిర్ర‌ర్స్` కంపెనీ ల‌క్ష్మి గారు.. ప‌ట్టు చీర‌లు ఇచ్చి రూ.30వేలు విరాళం ఇచ్చారు. నా జుత్తు రింగుల జుత్తు.. ఇది నాది కాదు.. న‌న్ను మార్చేశారిలా.. కార్ ఇచ్చి ప్ర‌యాణాల‌కు సాయం చేశారు. హైద‌రాబాద్ లో దేవ‌తులున్నారు దేవుళ్లున్నారు`` అంటూ ఎమోష‌న్ అయ్యారు బేబి.