Begin typing your search above and press return to search.

బ్లాక్ మెయిల్ తో 4ఏళ్లుగా అత్యాచారమా?: సింగర్ చిన్మయి ఫైర్

By:  Tupaki Desk   |   4 July 2020 5:00 PM GMT
బ్లాక్ మెయిల్ తో 4ఏళ్లుగా అత్యాచారమా?: సింగర్ చిన్మయి ఫైర్
X
తమిళనాడులో ఘోరాలు జరుగుతున్నాయి. తండ్రీకొడుకుల లాకప్ డెత్ దేశాన్ని కుదిపేసింది. తమిళ స్టార్ హీరోలంతా ఖండించారు.నిన్న ఏడేళ్ల బాలిక రేప్ కలకలం రేపింది. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.

తమిళనాడులో ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆమెపై నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. తాజాగా ఆమె అనుమానాస్పద మృతి ఘటన అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఈ ఘటనపై సింగర్ చిన్నయి శ్రీపాద తాజాగా నిప్పులు చెరిగింది.

తమిళనాడులోని చెయ్యూరు యూత్ లీడర్ దేవేంద్రన్ , అతడి సోదరుడు కలిసి ఓ మహిళపై గత నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. మహిళ (22) స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేయసాగారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెను తుదముట్టించారని తెలుస్తోంది.

ఈ ఘటనపై సింగర్ చిన్మయి కదిలిపోయింది. జస్టిస్ ఫర్ శశికళ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి దేశవ్యాప్తంగా సమస్యను దృష్టికి తీసుకెళ్లింది. ‘22 ఏళ్ల యువతి స్నానం చేస్తుండగా.. ఇద్దరు సోదరులు వీడియో తీశారు. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా అత్యాచారం చేశారు. జూన్24న ఉరివేసుకొని ఆమె చనిపోయింది. ఆమె కుటుంబం న్యాయం కోసం పోరాడుతోంది. నిందితులు పరారీలో ఉన్నారు’ అని ఆమె వాపోయింది. వీరు ఇద్దరు ఓ పార్టీకి చెందిన వారని ఆమె నిప్పులు చెరిగింది. న్యాయం కావాలంటూ నినదించింది.

డీఎంకేకు చెందిన నేతలే ఇలా చేశారని.. ఆ పార్టీ యూత్ లీడర్, హీరో స్టాలిన్ కొడుకు ఉదయనిధిని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.