Begin typing your search above and press return to search.
స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన పనిపై సింగర్ చిన్మయి ఫైర్
By: Tupaki Desk | 26 Nov 2019 5:25 AM GMTలైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పటమే కాదు.. బోల్డ్ వ్యాఖ్యలు చేసేందుకు ఏ మాత్రం వెనుకాడరు సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. తనకు న్యాయమనిపించే అంశాలపై ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమవుతారు. సోషల్ మీడియాలో తన పదునైన పోస్టులతో సంచలనంగా వ్యవహరించే చిన్మయి తాజాగా ఒక మహిళ పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్ చేసిన వ్యాఖ్యపై తీవ్రంగా స్పందించారు.
తాను చేసిన పోస్టులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా చిన్మయి మాత్రం వెనక్కి తగ్గటం లేదు సరికదా.. తాను తీసుకున్న స్టాండ్ మీదే నిలిచారు. అయితే.. ఈ సందర్భంగా ఆమె వాడిన పదజాలాన్ని కొందరు తప్పు పడుతున్నారు. ఇంతకూ జరిగిందేమంటే.. ఒక డెలివరీ కోసం ఇంటికి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్.. ఆర్డర్ తీసుకోవటానికి వచ్చిన యువతిని చూసి.. అన్నీ కనిపిస్తున్నాయి.. చున్నీ కప్పుకోండని వ్యాఖ్యానించాడట.
దీంతో ఒళ్లు మండిన ఆ యువతి.. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. స్విగ్గీ మీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు వారి పని వారు చూసుకుంటే మంచిదని చెప్పండి. మీ సంస్థకు చెందిన డెలివరీ బాయ్ పార్సిల్ ఇవ్వటానికి వచ్చి.. చున్నీ కప్పుకో అని నాకు సలహా ఇస్తున్నాడు. నా ఇంట్లో నేనెలా ఉండాలో చెప్పటానికి వాడెవడు? అసలు నేనెలా ఉంటే వాడికేంటి? ఇతరులతో ఎలా వ్యవహరించాలో వారికి మేమే నేర్పించాలా? అంటూ ఫైర్ అయ్యింది.
ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పలువురు ఆమె ట్వీట్ ను షేర్ చేశారు. కొందరు ఆ యువతి కామెంట్లను సమర్థిస్తే.. మరికొందరు తప్పు పట్టారు. అయితే.. తాను ప్రస్తావించిన అంశాన్నిజోక్ గా కామెంట్లు చేస్తే.. వారందరిని తాను బ్లాక్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే..ఈ అంశంపై సింగర్ చిన్మయి స్పందించారు.
సదరు యువతికి మద్దతుగా నిలిచిన ఆమె కాస్త నాటుగా రియాక్ట్ అయ్యారు. మహిళల వక్షోజాల్ని చూసే మగాళ్లను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే..వారు చిన్నప్పుడు తల్లి వద్ద పాలు తాగి ఉండదరు. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే అత్యాచారాలు జరుగుతాయనుకుంటారు. కొంతమంది డెలివరీ బాయ్ ను సమర్థిస్తున్నారు. ఒక డెలివరీ ఏజెంట్ కు అతను ఫుడ్ తీసుకెళ్ల ఇళ్లు ఆఫీసులతో సమానమంటూ మండిపడ్డారు. చెప్పాల్సిన విషయాన్ని మరీ అంత పచ్చిగా చెప్పే కన్నా.. కాస్త సున్నితంగా చెబితే బాగుంటుంది కదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.