Begin typing your search above and press return to search.
పాపం చిన్మయికి మరో షాక్..!
By: Tupaki Desk | 8 Dec 2018 12:30 PM GMTతమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై మీటూ అంటూ లైంగిక వేదింపుల ఆరోపణలు చేసిన చిన్మయిపై తమిళ సినీ పరిశ్రమలో అనధికారిక బ్యాన్ కొనసాగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే ఆమెను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించడం జరిగింది. సినిమా పరిశ్రమ నుండి ఆమెను దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏ సంగీత దర్శకుడు కూడా ప్రస్తుతం చిన్మయితో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
తనను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు కూడా వెళ్లిన చిన్మయికి ఈ సమయంలోనే మరో షాక్ తగిలింది. చిన్మయి తాజాగా జీవీ ప్రకాష్ హీరోగా ‘సర్వం తాళమయం’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రంకు ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన ఒక పాటను తెలుగు మరియు తమిళంలో విడుదల చేయడం జరిగింది. తమిళ వర్షన్ ను చిన్మయి పాడగా - తెలుగు వర్షన్ ను షాషా త్రిపాఠి పాడటం జరిగింది.
తెలుగులో షాషాకు క్రెడిట్ ఇవ్వగా - చిన్మయికి మాత్రం తమిళ లిరికల్ వీడియోలో క్రెడిట్ ఇవ్వలేదు. రహమాన్ సంగీతంలో పాడిన చిన్మయికి క్రెడిట్ ఇవ్వక పోవడం ఆమెకు షాక్ గా చెప్పుకోవాలి. ఈ విషయమై ఆమె స్పందిస్తూ.. తమిళ గాయనికి మాత్రమే క్రెడిట్ ఇవ్వక పోవడం బాధాకరం. ఇది నన్ను తీవ్రంగా అవమానించినట్లే అంటూ చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. చిన్మయితో ఈమద్య కాలంలో పాటలు పాడివ్వడానికి సంగీత దర్శకులు కూడా ఆసక్తి చూపడం లేదట. దాంతో ఆమె కెరీర్ ఖతం అయినట్లే అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.