Begin typing your search above and press return to search.
'నా కూతురి గాయం ఇంకా మానలేదు'..బాధలో ప్రముఖ గాయని
By: Tupaki Desk | 18 April 2020 11:30 PM GMTజీవితంలో కొన్ని సంఘటనలు కొందరిపై కోలుకోలేని ప్రభావం చూపిస్తాయి. అందులో సినీ రంగానికి చెందినవారికి సినిమాల్లో చూపించే ఎమోషనల్ సీన్స్ ఎక్కువే కనిపిస్తాయి. కొన్ని మరిచిపోదామన్నా.. ఆ సంఘటనల తాలూకు గాయాలు మనసును తొలిచేస్తూ వుంటాయి. ప్రముఖ గాయని చిత్ర తన కుమార్తె నందనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు నందన వర్ధంతి నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. గాయని చిత్ర కుమార్తె నందన 8 ఏళ్ల వయస్సులో 2011లో దుబాయ్ లో స్విమ్మింగ్ పూల్ లో పడి అనంతలోకాలకు వెళ్లిపోయింది.
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్ మాన్ కాన్సర్ట్ లో ప్రదర్శన కోసం వెళ్లిన సందర్భంలో చిత్ర బస చేసిన హోటల్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నాటి ఘటన చిత్రను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. "ప్రతి పుట్టుకకు ఓ కారణం ఉంటుందని పెద్దలు అంటారు. ఆ పని పూర్తయితే ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతుందని చెబుతారు. ఎలాంటి గాయాన్నైనా మాన్పించే గొప్ప గుణం కాలానికి ఉంటుందంటారు. కానీ ఇదంతా నిజం కాదని ఆ బాధని అనుభవించే వాళ్లకి మాత్రమే తెలుస్తుంది. కూతుర్ని పోగొట్టుకున్న నా గాయం ఇంకా పచ్చిగానే ఉంది. నా గుండెను పట్టి పీడిస్తూ బాధిస్తూనే ఉంది" అని ఆమె పోస్ట్ పెట్టారు. కడుపు కోత ఎంత ఆవేదన నింపుతుందో తల్లి అయిన చిత్రకు మాత్రమే తెలుసు. అందుకే ఆమె కూతురి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యింది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసినవారంతా ఎమోషనల్ అవుతున్నారు.