Begin typing your search above and press return to search.

ఆ సింగర్ తెగ నటించేస్తోంది!!

By:  Tupaki Desk   |   26 Nov 2016 11:37 AM GMT
ఆ సింగర్ తెగ నటించేస్తోంది!!
X
సింగర్ గీతా మాధురి టాలీవుడ్ ప్రేక్షకులకు తెగ పరిచయం. సౌత్ కి శ్రేయా ఘోషల్ అనిపించేసుకున్న గాయని ఈమె. రెండున్నరేళ్ల క్రితం 100%లవ్ ఫేమ్ యాక్టర్ నందును పెళ్లి చేసుకున్న ఈ సింగర్.. ఇప్పుడు యాక్టింగ్ ట్యాలెంట్ కూడా చూపించేయనుంది.

'మెట్రో' అనే మూవీలో నటించేస్తోంది గీతా మాధురి. చైన్ స్నాచింగ్ కథాంశంతో తెరకెక్కిన తమిళ్ మూవీ మెట్రోను.. అదే టైటిల్ పై తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ మూవీలో గీతా మాధురి సింగర్ గానే కనిపించనుండగా.. ఆమె పాడిన పాటను ఆమె పైనే చిత్రీకరించడం విశేషం. 'గీతా మాధురి పాడిన పాట ఈ మూవీకి హైలైట్. ఆమె చేసిన రోల్ విజువల్ ట్రీట్ లా ఉంటుంది' అంటున్న నిర్మాత. గీతామాధురి లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. చేతులు కట్టేసినా సరే.. మైక్ అందుకుని పాడేస్తున్న గీతా మాధురి ఇందులో కనిపిస్తుంది.

చిరుతలో 'చమ్కా చమ్కా చమ్కీ రే'.. మిర్చిలో 'డార్లింగే.. ఓసి నా డార్లింగే'.. నచ్చావులో చిత్రంలో 'నిన్నే నిన్నే కోరా'.. బాహుబలి లో 'జీవనది'.. గోలీమా్ రో 'మగాళ్లు ఒట్టి మాయగాళ్లు'.. లాంటి పాటలకు గాయనిగా అవార్డులు అందుకున్న గీతామాధురి.. గతంలో షాడో మూవీ కోసం 'ఐయామ్ నాటీ గాళ్ గాళ్ గాళ్' పాట మేకింగ్ వీడియోలో కనిపించిందంతే.