Begin typing your search above and press return to search.
ఇంటర్వ్యూ: 'క్రేజీ అంకుల్స్' ఫన్నీగా సాగే క్రేజీ సినిమా
By: Tupaki Desk | 17 Aug 2021 1:30 PM GMTఇ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ అంకుల్స్’. ఇందులో బుల్లితెర బ్యూటీ శ్రీముఖి - సింగర్ మనో - రాజా రవీంద్ర - భరణి ప్రధాన పాత్రలు పోషించారు. గుడ్ సినిమా గ్రూప్స్ - గ్రీన్ మెట్రో మూవీస్ - శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్ లో ఒకరిగా నటించిన సింగర్ మనో మీడియాతో ముచ్చటించారు..
- క్రేజీ అంకుల్స్ ఫన్నీగా.. అందరికీ ఆనందాన్నిచ్చే క్రేజీ సినిమా. యాబై ఏళ్లు దాటిన రాజు - రెడ్డి - రావు అనే
ముగ్గురు ఫ్రెండ్స్ కథ ఇది. ఒకరకంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కథ అని చెప్పొచ్చు (నవ్వుతూ). యాబై ఏళ్లు దాటిన ముగ్గురు ఫ్రెండ్స్ ఇళ్లలో తమను పెద్దగా పట్టించుకోవడం లేదని ఫీల్ అవుతుంటారు. ఆ సమయంలో వారికొక లేడీ సింగర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయికి ముగ్గురు ఎలా ఆకర్షితులవుతారు. దాని వల్ల వాళ్లకు వచ్చే సమస్యలేంటి? చివరకు ఎలా బయటపడతారనేదే ఈ కథ.
- ఇందులో బంగారు షాపు యజమాని పాత్ర చేశాను. మిగతా ఇద్దరి కంటే సరదాగా ఉండే పాత్ర. స్వతహాగా కూడా.. నేను జోవియల్‌గానే ఉంటాను. ఇది ఇప్పటి యంగ్ జనరేషన్ కూడా చూడాల్సిన చిత్రమే. ఎందుకంటే ఇప్పుడు ముప్పై ఏళ్లున్న వాళ్లు మరో ఇరవై ఏళ్ల తర్వాత యాబై ఏళ్లకు చేరుకుంటారు. అప్పుడెలా ఉండాలి.. లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటే కుటుంబం ఎలా ఇబ్బందులు పడుతుందనే విషయాలపై ఓ అవగాహన కలుగుతుంది. ప్రేక్షక దేవుళ్లు థియేటర్స్ కు వచ్చి ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే సినిమాను విడుదల చేస్తున్నాం.
- ఇంతకు ముందు కంటే సింగర్ గా తక్కువ పాటలు పాడుతున్నా. ట్రెండ్ మారడం వల్ల అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగు ఐదు భాషల్లో పాడడం వల్ల ఇప్పటికీ నాకు పాటలు వస్తున్నాయి. అప్పట్లో ఇండస్ట్రీ అంతా దాదాపు ఒకేచోట కేంద్రీకృతమై ఉండటం వల్ల సింగర్స్ అందరికీ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అలా లేదు.
- ఇప్పటి వరకు 13 భాషల్లో 25 వేల పాటలు పాడాను. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో మరో 25వేల పాటలు పాడాను. ప్రతి సింగర్ లోనూ ఓ ఆర్టిస్ట్ ఉంటాడు. పాట పాడేటప్పుడు హీరోను ఊహించుకుంటూ ఆ వాయిస్ లో పాట పాడతాం. అప్పుడే సిట్యువేషన్ కు తగినట్లు పాట పండుద్ది. అలా చేసే ప్రతి సింగర్ లోనూ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ ఆర్టిస్ట్ కు ఇలాంటి అవకాశాలు దక్కినప్పుడు ఎలివేట్ అవుతాడు.
- దాసరి గారు 'ఓ ఆడది ఓ మగాడు' సినిమాలో నన్ను చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేశారు. 'రంగూన్ రౌడీ' లో చిన్నప్పటి కృష్ణంరాజుగా.. 'నీడ' లో రమేశ్ - మహేశ్ గారితో వర్క్ చేశాను. 'కేటుగాడు' లో చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశాను.
- రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆలోచిస్తాను. నటుడిగా అన్నీ తరహా పాత్రలు చేయాలని ఉంది. మరి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.