Begin typing your search above and press return to search.

వాళ్లు పోతేనే మారుతుందన్న లేడీ సింగర్

By:  Tupaki Desk   |   8 April 2017 4:45 PM GMT
వాళ్లు పోతేనే మారుతుందన్న లేడీ సింగర్
X
ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ ప్రణవి అందరికీ బాగానే తెలుసు. ఎన్నో తెలుగు పాటలు పాడిన ఈమె.. ప్రతిష్టాత్మక నంది అవార్డు కూడా గెలుచుకున్న ప్రతిభావంతురాలు. తాజాగా ఇండస్ట్రీ గురించి.. ముఖ్యంగా సింగర్లకు అందే రెమ్యూనరేషన్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం అవుతున్నాయి. ప్రణవి చెబుతున్న ప్రకారం.. సింగర్స్ కు ఒక్కో పాటకు కేవలం 5 వేల రూపాయలు మాత్రమే పారితోషికంగా ఇస్తున్నారు.

" వెయ్యికి.. మూడు వేలకు పాడమని అడిగేవారు కూడా ఉన్నారు. కొంతమంది సింగర్లు ఉచితంగా పాడేందుకు కూడా రెడీగా ఉన్నారు. అందుకే నిర్మాతలు పాటలు పాడేవారికి ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. నేను ఓ జింగిల్ నో.. టీవీ సీరియల్ కి పాడితేనో ఎక్కువ మొత్తం.. 30వేల వరకూ అందుతుంది. కానీ సినిమాల్లో మాత్రం నా రెమ్యూనరేషన్ 5వేలకు ఫిక్స్ చేసేశారు" అంటూ బాధతో కూడిన కఠిన స్వరంతో చెప్పింది ప్రణవి. "కొంతమంది మేకర్స్ విలువ ఇస్తారు. టైట్ బడ్జెట్ తో రూపొందిన పెళ్లిచూపులు నిర్మాతలు నాకు పాటకు రూ. 15వేలు ఇచ్చారు. కానీ పెద్ద బ్యానర్లు మాత్రం 5వేలు మాత్రమే ఇస్తాయి" అని చెప్పిందామె.

ఒక సింగర్ కంటే తన అసిస్టెంట్స్ కు ఎక్కువ మొత్తం ఇస్తానని ప్రణవి భర్త.. కొరియోగ్రాఫర్ రఘు చెప్పడం విశేషం. పేరు కోసం ఉచితంగా పాటలు పాడే సంస్కృతి.. వ్యక్తులు పోనంత వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని ప్రణవి చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/