Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో`చిక్కుకున్న` సింగ‌ర్!

By:  Tupaki Desk   |   28 July 2018 2:17 PM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో`చిక్కుకున్న` సింగ‌ర్!
X
ఈ మ‌ధ్య‌కాలంలో టాలీవుడ్ - కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లో కొంత‌మంది పెద్దింటి పిల్లలు - సెల‌బ్రిటీలు - సినీ ప్ర‌ముఖులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, కొన్నిసార్లు ప‌ట్టుబ‌డ్డ‌వారిలో కొంద‌రు నానా ర‌చ్చ చేసిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. తాజాగా, అదే కోవ‌లో టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈయనతో పాటు యాంకర్ లోబో కూడా ప‌ట్టుబ‌డ్డాడు. అయితే, వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిగా ర‌భ‌స జరిగింది. లోబో - రాహుల్ ....డ్రంక్ అండ్ డిబేట్ వీడియోలు సోష‌ల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో రాహుల్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కొస‌మెరుపు.

చలో - రంగస్థలం - జోష్ - దమ్ము - రచ్చ ల‌తో పాటు ప‌లు టాలీవుడ్ చిత్రాల‌లో రాహుల్ ఎన్నో పాట‌లు పాడారు. చ‌లో సినిమాలో రాహుల్ పాడిన పాట బాగా హిట్ అయింది. ”టెక్కు లాపవే - టెక్కు లాపవే - చిక్కి నావే నువ్వు డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా” అంటూ హీరోయిన్ ని ఉద్దేశించి హీరో ఆ పాట పాడుతాడు. కాక‌తాళీయ‌మో....విధి వైప‌రీత్య‌మో తెలియ‌దుగానీ....ఆ పాట పాడిన రాహుల్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసుల‌కు చిక్కాడు. అంతేకాకుండా, పోలీసుల ద‌గ్గ‌ర టెక్కు చూపించబోయిన రాహుల్ సోష‌ల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యాడు. మ‌రి, యాంక‌ర్ ప్ర‌దీప్ త‌ర‌హాలో....రాహుల్ - లోబోలు కూడా....పోలీసు సెష‌న్స్ కు హాజ‌ర‌య్యేంద‌కు ఇబ్బంది ప‌డ‌తారా....లేదా అన్న‌ది వేచి చూడాలి.