Begin typing your search above and press return to search.

సింగర్ కి రోడ్ యాక్సిడెంట్.. ఎయిర్ బ్యాగ్స్ లేకుంటే మాత్రం..!

By:  Tupaki Desk   |   7 May 2023 9:00 PM GMT
సింగర్ కి రోడ్ యాక్సిడెంట్.. ఎయిర్ బ్యాగ్స్ లేకుంటే మాత్రం..!
X
ప్రముఖ కన్నడ సింగర్ రక్షిత సురేష్ అంటే అందరికి సుపరిచితురాలే. ఆమె పాటలతో కన్నడ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమధ్య ఎక్కడ చూసినా సరే రక్షిత సురేష్ పాటలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా పొన్నియిన్ సెల్వన్ 2 లో కూడా ఆమె ఒక సాంగ్ పాడారు. అయితే ఈరోజు తను మళ్లీ పుట్టానని అంటూ కొద్ది నిమిషాల క్రితమే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇంతకీ రక్షిత సురేష్ కు ఏమైంది అంటే.. మలేసియాలో ఎయిర్ పోర్ట్ కు వస్తున్న టైం లో ఆమె కారు డివైడర్ మీదకు ఎక్కేసిందట. ఆమె ఒక రెండు సెకన్ల పాటు జీవితంలో ఏం జరుగుతుంది అని ఆలోచించిందట.

ఎయిర్ బ్యాగ్స్ వల్ల తాను సురక్షితంగా బయటపడ్డానని. చిన్న చిన్న దెబ్బలు తప్ప పెద్దగా గాయాలేమి కాలేదని.. ఆ డ్రైవర్ కు చాలా థాంక్స్ అంటూ కామెంట్ పెట్టింది రక్షిత సురేష్. ఎయిర్ బ్యాగ్స్ లేకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేదని ఆమె రాసుకొచ్చారు.

జరిగిన యాక్సిడెంట్ గురించి తలచుకుంటే ఇప్పటికీ తనకు ఒణుకు వస్తుందని అన్నారు. తనతో పాటు మరో కో ప్యాసింజర్ కూడా ఉన్నారు. వారు కూడా చాలా సేఫ్ గా ఉన్నారు. తంకు ఈరోజు బ్రతికి ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్ననని అన్నారు. విషయం తెలుసుకున్న రక్షిత ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఆమెకు జరిగిన యాక్సిడెంట్ గురించి మరిన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు.

రక్షిత సురేష్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చల్లగాలి అనే సాంగ్ కూడా పాడారు. ఏది ఏమైనా ఎయిర్ బ్యాగ్స్ వల్ల తన ప్రాణాలు నిలిచాయని సింగర్ రక్షిత తన యాక్సిడెంట్ గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.