Begin typing your search above and press return to search.

పద్మ అవార్డును తిరస్కరించి కేంద్రానికి షాకిచ్చిన లెజండరీ సింగర్

By:  Tupaki Desk   |   26 Jan 2022 10:35 AM GMT
పద్మ అవార్డును తిరస్కరించి కేంద్రానికి షాకిచ్చిన లెజండరీ సింగర్
X
దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభ చాటుకున్న ప్రముఖులకు కేంద్రం నిన్న పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 128మందికి ఈ అవార్డులను ప్రకటించారు. నలుగురికి పద్మ విభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు.

అయితే బెంగాల్ కు చెందిన మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జితోపాటు గాయకుడు, మ్యాజిక్ డైరెక్టర్ హేమంత ముఖోపాధ్యాయ్, గాయని సంధ్యా అవార్డులను తిరస్కరించడం వివాదంగా మారింది. ఈ క్రమంలోనే సంధ్య కూతురు ఓ ప్రకటనలో ఘాటుగా విమర్శలు చేయడం వివాదంగా మారింది.

బెంగాల్ సంగీత ప్రపంచంలో సంధ్యా ముఖోపాధ్యాయ్ ను లెజండరీగా సింగర్ గా అభివర్ణిస్తున్నారు. ప్రముఖ గాయకుడు హేమంత ముఖర్జీతో కలిసి ఎవర్ గ్రీన్ సాంగ్స్ పాడారు. సంధ్యా కేవలం బెంగాలీ సంగీతానికే పరిమితం కాలేదు. బాలీవుడ్ లో సంగీత దిగ్గజాలు ఎస్టీ బర్మన్, అనిల్ బిస్వాస్, మదన్ మోహన్, రోషన్,సలీల్ చౌదరితో కలిసి ఎన్నో పాటలు పాడి సంగీత అభిమానులను ఆకట్టుకున్నారు.

ఇక తన తల్లి సంధ్యా ముఖోపాధ్యాయ్ కి పద్మ శ్రీ అవార్డు ప్రకటించడంపై ఆమె కూతురు సాయి సేన్ గుప్తా ఘాటుగా స్పందించారు. పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తున్నట్టు ఢిల్లీ నుంచి ఉన్నతాధికారి సమాచారం అందించగా.. తనకు స్వీకరించడం ఇష్టం లేదు అని తల్లి చెప్పారని సాయిసేన్ తెలిపింది. 8 దశాబ్ధాలు కెరీర్ ఉన్న గాయనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం ఆమె ప్రతిష్టను, హోదాను కించపరచడమేనని.. అవార్డును తిరస్కరిస్తున్నట్టు సాయిసేన్ గుప్తా తెలిపారు.

పద్మ శ్రీ జూనియర్ ఆర్టిస్టుల స్థాయి.. గీతాశ్రీ లాంటి సంధ్యా ముఖోపాధ్యాయ్ కి ఆ అవార్డు సరితూగదని..ఆమె గాన మాధుర్యానికి ప్రజలు ఎప్పుడో వెలకలేని అవార్డులను, పురస్కారాలను ఇచ్చారని కూతురు సౌమ్య సేన్ గుప్తా ఘాటుగా స్పందించారు. భారత రత్నా లేదా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇచ్చి గౌరవించుకోవాల్సిన పరిస్థితి అని.. దేశం గర్వించే గాయకుల్లో ఆమె ఒకరని అన్నారు.