Begin typing your search above and press return to search.

సింగపూర్ ఎయిర్ లైన్స్ కి సింగర్ స్ట్రోక్

By:  Tupaki Desk   |   16 May 2019 7:50 AM GMT
సింగపూర్ ఎయిర్ లైన్స్ కి సింగర్ స్ట్రోక్
X
ఒకప్పుడు ఏదైనా వస్తువులు లేదా సేవల విషయంలో వినియోగదారులు అసంతృప్తికి గురైతే దాన్ని వ్యక్తపరిచే సాధనాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కేవలం కొన్ని సెకండ్లలో మన ఫీలింగ్స్ ని పంచుకునే ఛాన్స్ దక్కుతోంది. సెలబ్రిటీలకు ఇది ఇంత కన్నా తక్కువ టైంలోనే వాళ్ళ భావాలు ప్రపంచానికి చేరిపోతున్నాయి.తాజాగా సింగర్ శ్రేయ ఘోషల్ ఓ ఎయిర్ లైన్స్ కి ఇచ్చిన స్ట్రోక్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.

ఇటీవలే సింగపూర్ ఎయిర్ లైన్స్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న శ్రేయా తనతో పాటు ఓ అరుదైన మ్యూజికల్ ఇన్స్ట్రూమెంట్ ని తనతో పాటు ఫ్లైట్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించింది. అయితే సదరు విమాన సిబ్బంది దీన్ని అనుమతించలేదు. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది కానీ ప్రమాదం కానీ లేకపోయినా తిరస్కరించడంతో కోపం వచ్చిన శ్రేయ ఘోషల్ దీని గురించి ఘాటుగా ట్వీట్ చేసింది

వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ సింగపూర్ ఎయిర్ లైన్స్ వాళ్లకు తనలాంటి గాయకులు లేదా ఏదైనా అరుదైన వాయిద్య పరికరం ఉన్న వాళ్ళు ప్రయాణించడం ఇష్టం లేనట్టుంది మంచిది ఓ గుణపాఠం నేర్చుకున్నాను అని సెటైర్ స్ట్రాంగ్ గా వేసింది. ఇది కాస్తా వైరల్ అయిపోయి సింగపూర్ ఎయిర్ లైన్స్ క్షమాపణ చెప్పడమే కాకుండా ఈ ఇష్యూకి సంబంధించి అధికారులను కలవమని కోరింది.ఒక చిన్న ట్వీట్ కార్పొరేట్ సంస్థ కొమ్ము విరుస్తోందని చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా. తీయని గొంతుతో మాధుర్యాన్ని పంచడమే కాదు ఇలా అవసరమైనప్పుడు ఘాటు చురకలతో వాయిస్తానని రుజువు చేసింది శ్రేయ ఘోషల్