Begin typing your search above and press return to search.

నాగులుకో మాట చెబితే సరిపోయేది

By:  Tupaki Desk   |   3 April 2018 6:18 AM GMT
నాగులుకో మాట చెబితే సరిపోయేది
X
రంగస్థలం గ్రాండ్ సక్సెస్ ని ఒకవైపు ఫాన్స్ ఎంజాయ్ చేస్తుండగానే మరోవైపు ఎలాంటి వివాదాలు లేవు అనుకుంటున్న టైంలో గాయకుడు శివనాగులు ఇష్యూ ఇప్పుడు మీడియా ఛానల్స్ లోకి ఎక్కడంతో అది మెల్లగా పెద్దదవుతోంది. తనకు తెలియకుండా దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ తో సినిమాలో రీ ప్లేస్ చేసారంటున్న శివనాగులు కనీసం తనకో మాట కూడా చెప్పలేదని ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయటం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చగా మారింది. దీని గురించి సుకుమార్ రిలీజ్ రోజే స్పష్టత ఇచ్చినా నిన్న జరిగిన సక్సెస్ మీట్ పూర్తయ్యాక మరోసారి చెప్పాడు. చరణ్ బాడీ లాంగ్వేజ్ కి శివనాగులు వాయిస్ కి సింక్ కాకపోవడం వల్లే షూటింగ్ టైంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ గొంతు ఉన్న పాటనే సినిమాలో పెట్టాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.

కాని శివనాగులుకు ఒక మాట చెబితే సరిపోయేది కదా అన్న ప్రశ్న మాత్రం సుక్కుకు ఎదురుకాలేదు. పోనీ దేవి అయినా విడుదలకు ముందు కాని తర్వాత కాని ఈ సవరణ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సరిగ్గా ఇక్కడే శివనాగులు హర్ట్ అయ్యాడు. విడుదల మొదటి రోజు మొదటి ఆటకే తన స్నేహితులంతా వెళ్ళారని సెకండ్ హాఫ్ లో పాట కాగానే బయటికి వచ్చి నీ గొంతు లేదని శివనాగులుకు చెప్పారు. కాని ఆ సౌండ్ లో అల్లరిలో మీకు సరిగా వినిపించలేదమో అని సర్దిచెప్పిన శివనాగులు తీరా మధ్యాన్నం స్వయంగా సినిమా చూసినప్పుడు కాని అర్థం కాలేదట పాటలో తన గొంతు మాయమయ్యిందని.

ఇది మరీ దుమారం లేచేంత వివాదం కాదు కాని ఇలా చేయటం పట్ల సుకుమార్ మీద దేవి మీద సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పడుతున్నాయి. ఓ మాట చెప్పేసి కమ్యునికేషన్ గ్యాప్ లేకుండా చూసుకుని ఉంటె ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా అంటున్నారు. సుకుమార్ మాత్రం ఎప్పటికీ ఒరిజినల్ ఆడియోలో శివనాగులు పాటే ఉంటుందని నిన్న మరోసారి స్పష్టం చేసాడు.