Begin typing your search above and press return to search.
బిగ్ బాస్..అస్సలు నచ్చదంటూ సింగర్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 6 Sep 2022 5:32 AM GMTప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్ బాస్'. తాజాగా తెలుగులో సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రియాల్టీ షోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే పెద్ద మనుషుల్లో కామ్రేడ్ నారాయణ ఒకరు. ఈ షోను ఏకంగా బూతు షోగా అభివర్ణించే ఆయన.. తనకున్న అసహనాన్ని వెల్లడించేందుకు ఏ మాత్రం వెనకడుగు వేయని ఆయనకు జతగా మరో సెలబ్రిటీ బయటకు వచ్చారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సింగర్ స్మిత. తనకు బిగ్ బాస్ షో అస్సలు పడదని తేల్చేశారు. బిగ్ బాస్ నుంచి ఎప్పుడైనా పిలుపు వచ్చిందా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు అస్సలు నచ్చని షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాసేనన్న ఆమె.. ఒకవేళ తనకు పొరపాటున ఆఫర్ వచ్చినా తాను మాత్రం అస్సలు ఒప్పుకోనని చెప్పారు.
''పొరపాటున కూడా అంగీకరించి తప్పు చేయను. అన్ని రోజులు కుటుంబాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నెలల పాటు సెలబ్రెటీలను లాక్ చేసి తన్నుకోండి.. మేం టీఆర్పీలను పెంచుకుంటామని అనటం ఎంతవరకు సబబు? అందుకే ఈ షోను చూడను.
చచ్చినా వెళ్లను. నాకు సన్నిహితులైన వారు వెళతానని చెబితే వద్దని చెబుతా. నాకు బాగా క్లోజ్ గా ఉన్న వారు వెళతానని అంటే మాత్రం.. నీకేమొచ్చిందని అడుగుతా' అంటూ తనకున్న అగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తాజా సీజన్ 6లో తనకు తెలిసిన వారు.. స్నేహితులు ఈ షోకు వెళ్లారని.. వాళ్ల గురించి తానేమీ మాట్లాడనని చెప్పారు. బిగ్ బాస్ షోకు వెళ్లటం అన్నది అది వారి వ్యక్తిగత విషయమని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేం మాట్లాడినా.. తనకు తెలిసిన వారిని తప్పు పట్టినట్లు అవుతుందని.. అందుకే ఇప్పుడు ఆ షో గురించి తాను మాట్లాడాలని అనుకోవటం లేదన్నారు.
ఏమైనా. స్మిత మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రానున్న రోజుల్లో నారాయణ.. స్మితకు తోడుగా మరెంత మంది ప్రముఖులు బిగ్ బాస్ షోను తప్పు పడుతూ బయటకు వస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.