Begin typing your search above and press return to search.
కరోనాకు గ్రహాలకు లింక్ పెట్టిన గాయిని
By: Tupaki Desk | 30 March 2020 10:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. చూస్తుండగానే కరోనా పాజిటివ్ ల సంఖ్య మిలియన్ మార్క్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 దేశాలకు పైగా ప్రస్తుతం కరోనా వైరస్ దాటికి అతలాకుతలం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవ్వడం వల్ల వారిని వారు కాపాడుకోవడం తో పాటు వారి కుటుంబ సభ్యులను కాపాడుకున్న వారు అవుతారు అలాగే దేశాన్ని కాపాడిన వారు అవుతారంటూ ప్రముఖులు పిలుపునిస్తున్నారు. తాజాగా ప్రముఖ పాప్ సింగర్ స్మిత కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే ఈమె కరోనాకు గ్రహాల కదలికలతో లింక్ పెట్టింది.
సోషల్ మీడియాలో స్మిత ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో మాట్లాడుతూ.. సెల్ఫ్ క్వారెంటైన్ లో అయిదు రోజులు గడిచి పోయాయి. ఈ అయిదు రోజులు కూడా నాకు ఇష్టమైన పనులు చేస్తూ నా కూతురుతో టైం స్పెండ్ చేశాను. ఈ సమయంలోనే నాకు రోజు వారి కూలీలు పడుతున్న బాధలు వారు తిండికి పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించి ఒక రోజంతా కూడా నిద్ర పట్టలేదు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు మాత్రం ఇబ్బందులు పడుతున్నట్లుగా వార్తలు చూస్తూనే ఉన్నాం అంది.
ఇక రాబోయే మూడు రోజులు మరింత కీలకం అని ఆ మూడు రోజుల్లో చంద్రుడు మీదకు రాహువు రాబోతున్నాడు. ఇంకా శని.. అంగారకుడు.. గురు గ్రహాలు కూడా కలువబోతున్నాయి. జోతిష్యం ప్రకారం ఈ సమయంలో చాలా ప్రమాదకరం. వైరస్ వ్యాప్తి కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. కనుక ఈ మూడు రోజులు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాలని ఇంట్లో ఏం ఉంటే వాటితో సరిపెట్టుకుని జీవితం గడిపేయాలంటూ స్మిత విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతం జనాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న ఈ సమయంలో ఇలా గ్రహాల పేరు చెప్పి వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని భయపెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు స్మితను ప్రశ్నిస్తున్నారు.