Begin typing your search above and press return to search.
టాలీవుడ్ నుండి రోహిత్ తర్వాత సింగర్ స్మిత
By: Tupaki Desk | 10 Jan 2020 5:19 AM GMTఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి రైతుల నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను తీసుకోవడం జరిగిందని.. ఇప్పుడు రైతులకు అన్యాయం చేసే విధంగా అమరావతి మాత్రమే రాజధాని కాదు మూడు ప్రాంతాల్లో రాజధాని ఉండాలంటూ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకు రావడం ఏంటీ అంటూ రైతులు గత మూడు నాలుగు వారాలుగా దర్నాలు చేస్తున్నారు. రైతుల ఆందోళన కు తెలుగు దేశం పార్టీ.. జనసేన తో పాటు పలు పార్టీలు మరియు ప్రజా సంఘాల వారు మద్దతు ఇచ్చారు. కాని నిన్నటి వరకు టాలీవుడ్ నుండి వారికి మద్దతు దక్కలేదు.
ఇటీవలే టాలీవుడ్ హీరో నారా రోహిత్ అమరావతి రైతుల పక్షాన నిలుస్తూ ప్రకటన చేశాడు. వారికి న్యాయం చేయాల్సిందే అని.. ఏపీకి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆయన డిమాండ్ చేశాడు. టాలీవుడ్ నుండి మొదటి సపోర్టర్ గా నారా రోహిత్ నిలిచాడు. ఇప్పుడు ఆయనతో పాటు ప్రముఖ సింగర్ స్మిత కూడా అమరావతి రైతుల పక్షాన నిలిచింది. ఆమె అమరావతి రైతులకు అన్యాయం చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. అమరావతి రైతులారా మేము మీతో ఉన్నాం అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మీ యొక్క బాధల గురించి నేను ప్రార్థిస్తున్నాను. మేము తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అనే మరో హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో అమరావతి రైతులకు మద్దతుగా నిలిచింది. మూడు రాజధానులపై చిరంజీవి సానుకూల ప్రకటన చేయగా కొందరు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారట. కాని వారు మాత్రం ప్రభుత్వంకు భయపడో లేదంటే మరే కారణమో కాని తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పడం లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నారు. స్మిత రాజధాని రైతులకు మద్దతు గా నిలుస్తూ చేసిన పోస్ట్ లకు భారీ స్పందన వస్తుంది. అందులో కొందరు అమరావతిలో నీవు ఎంత పెట్టుబడి పెట్టావు.. నీకు ఎంత భూమి ఉంది అంటూ ప్రశ్నిస్తు కామెంట్స్ చేస్తున్నారు.