Begin typing your search above and press return to search.
సింగర్ ని చంపేస్తామని బెదిరింపులు
By: Tupaki Desk | 30 May 2019 5:44 AM GMTసల్మాన్ ఖాన్ - ప్రియాంక చోప్రా ఎపిసోడ్స్ లో అనూహ్యంగా గాయని సోనా మొహపాత్రా ఎంటరైన సంగతి తెలిసిందే. నిక్ జోనాస్ ని పెళ్లాడి విదేశీ కోడలు అయిపోయిన ప్రియాంక చోప్రాపై పదే పదే సల్మాన్ దషణని నిలదీసే ప్రయత్నం చేసింది సోనా. ఒకరిని పెళ్లాడి తన వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకున్న ప్రియాంక చోప్రా మగువలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. `భారత్` సినిమాలో నటించడం కోసం తన లైఫ్ ని వదులుకోవాల్సిందేనా? పీసీపై ఎందుకు కామెంట్లు చేస్తారు? అంటూ సల్మాన్ భాయ్ ని సామాజిక మాధ్యమాల వేదికగా సూటిగానే ప్రశ్నించింది సోనా. అదొక్కటే కాదు... ప్రియాంక చోప్రాకి అన్ని విధాలా బాసటగా నిలుస్తూ సల్మాన్ పై వ్యంగ్యాస్త్రాల్ని సంధించింది.
అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ కండల హీరో సల్మాన్ ఖాన్ స్పందించలేదు కానీ అభిమానులు మాత్రం వైల్డ్ గా స్పందిస్తున్నారట. దీనిపై సోనా మెహపాత్ర ఆవేదన చెందుతూ సామాజిక మాధ్యమాల్లో ఆ సంగతిని బహిర్గతం చేశారు. సల్మాన్ ఫ్యాన్స్ తనని చంపేస్తామని బెదిరించారని ఆరోపించింది. అయితే ఇలాంటి బెదిరింపులు రెగ్యులర్ గా చూసేవే. వీటికి భయపడనని గాయని మొహపాత్రా మొండితనం చూపడం చర్చకొచ్చింది.
``చంపేస్తామని బెదిరిస్తున్నారు. అసభ్యకరంగా కామెంట్లతో మెయిల్స్ పంపారు. ఇలాంటి బెదిరింపు మెయిల్స్ నాకు రోజూ వస్తూనే ఉంటాయి. తప్పుగా వ్యాఖ్యలు చేసే సల్మాన్ ఖాన్ `భారత్` టైటిల్‌తో సినిమా చేయడం హాస్యాస్పదం`` అని ట్విట్టర్ లో వెల్లడించారు సోనా. తన ట్విట్టర్ లో జాతీయ మహిళా సంఘాన్ని ట్యాగ్ చేసి తనతో పెట్టుకోవద్దని హెచ్చరించడం చర్చకొచ్చింది.