Begin typing your search above and press return to search.
'బిగ్ బాస్ -5'లో షాకిచ్చిన ఇండియన్ ఐడల్
By: Tupaki Desk | 17 Sep 2021 1:30 AM GMT`బిగ్ బాస్ -5` సీజన్ రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ప్రారంభమై పదిరోజులే అయినా హోస్ట్ నాగార్జున వాళ్లలో రియాల్టీని తట్టి లేపుతున్నారు. టాస్క్ లతో సెట్ ని వెడెక్కిస్తున్నారు. సీజన్ -4 లా కాకుండా సీజన్ -5 ఆరంభంలోనే ఘాటైన పదజాలంతో హీటెక్కడం సర్వత్రా చర్చకొస్తోంది. వివాదాలతో మోతెక్కిపోతోంది. పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్ ని అమాంతం పెంచే ప్రయత్నాలు సీరియస్ గానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆడియన్స్ సైతం బిగ్ బాస్ -5 పై పాజిటివ్ గా స్పందించడం చర్చకొచ్చింది. తాజాగా టాస్క్ లో భాగంగా `సాగర సోదర` అనే గేమ్ లో ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వోల్వ్స్ - ఈగల్స్ అనే రెండు టీమ్ లుగా విభింజించి నిర్వహించిన గేమ్ షో ఎంతో ఆసక్తికరంగా సాగింది.
ఈ సందర్భంగా కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనతో మైండ్ గేమ్ ఆడొద్దని.. జెన్యున్ గా మాత్రమే ఉండాలని సూచించాడు. తాను బిగ్ బాస్ విజేత అయ్యి 50 లక్షలు సంపాదించాలని రాలేదరన్నారు. ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతాననే కారణంతోనే షోకి వచ్చినట్లు తెలిపారు. ఒకవేళ విన్నర్ గా నిలిచి 50 లక్షలు వస్తే ఆ డబ్బును తిరిగి వాళ్లకే ఇచ్చేస్తానని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో హౌస్ మెట్సే సహా ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు. ఇప్పటిరకూ కంటెస్టెంట్ నుంచి ఇలాంటి ప్రకటన రాలేదు. గెలిస్తే కొంత తాను ఖర్చు పెట్టుకుంటానని..ఇంకొంత సమాజ సేవకు వాడుతానని చెప్పిన వాళ్లు తప్ప బిగ్ బాస్ కే ఇచ్చేస్తానని అన్నది లేదు.
కానీ శ్రీరామ్ అందరికంటే భిన్నంగా స్పందించి ఆశ్చర్యానికి గురి చేయడం విశేషం. శ్రీరామ్ ఇండియన్ ఐడల్ విన్నర్ గా అందరికి తెలిసిందే. ఆ ఓతో శ్రీరామ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆ క్రేజ్ తో టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్నారు. కానీ నటుడిగా బిజీ మాత్రం కాలేకపోయారు. గాయకుడిగా మాత్రం శ్రోతల్ని అలరిస్తున్నారు. వివిధ భాషల్లోనూ శ్రీరామ్ ఎన్నో పాటలు పాడారు. ఆయా భాషల్లోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.