Begin typing your search above and press return to search.
వైరల్: భర్తతో సింగర్ సునీత లేటెస్ట్ పిక్..!
By: Tupaki Desk | 27 Jun 2021 3:30 AM GMTతెలుగు ఇండస్ట్రీలో సింగర్ సునీత ప్రత్యేకమైన ఆదరణ కలిగివుంది. చాలా ఏళ్లు ఒంటరి జీవితం గడిపిన సునీత ఈ ఏడాది సెకండ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంది. కొన్నేళ్లపాటు పెళ్లి గురించి ముసుగులో గుద్దులాటలా దాచిన మేటర్ పెళ్లి చేసుకోబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతూ వచ్చింది. అంతా ఆశ్చర్యపోయే లోపల నిశ్చితార్థం వార్త చెప్పి తన ఎంగేజ్మెంట్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్లి వచ్చిన సునీత ప్రస్తుతం మళ్లీ టీవీ ప్రోగ్రాంస్ వైపు దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
తాజాగా సునీత మరోసారి సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. కానీ ఒంటరిగా కాదు. ఈసారి తన భర్తతో కలిసి క్యాండీడ్ పిక్ పోస్ట్ చేసింది. భర్త రామ్ తో సునీత ఏదో మాట్లాడుకుంటున్నట్లు ఫోటోలో మనం గమనించవచ్చు. చాలారోజుల తర్వాత సోషల్ మీడియాలో ఫేవరేట్ సింగర్ కనిపించడంతో నేటిజన్లు ఏం పోస్ట్ చేసిందో అని ఉత్సాహంగా చూస్తూ లైక్ కొడుతున్నారు. అయితే పెళ్లికి ముందు సునీత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉండేదో.. పెళ్లి తర్వాత పెద్దగా సోషల్ మీడియా కోసం కేటాయించే టైం లేనట్లుంది. అందుకే అప్పుడప్పుడు పోస్టులు పెడుతోంది. అయితే పెళ్ళికి ముందుకంటే పెళ్లి తర్వాతే వార్తలలో నిలుస్తుంది సునీత.
సునీత నాలుగు పదుల వయసు దాటాక వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని ఇష్టపడి పెళ్లాడింది. అయితే ఈ పెళ్లి కూడా తన పిల్లలకోసమే చేసుకున్నాను అని తెలిపింది. భర్త గురించి చాలా బాగా మాట్లాడుతుంది సునీత. ఆయనతో మిగిలిన జీవితాన్ని కంటిన్యూ చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. సునీత భర్త రామ్ ఆమెకంటే ఐదేళ్లు పెద్దవారు. పెళ్లి అయినప్పటి నుండి వీరిద్దరూ జోడి అదిరిందని కంప్లిమెంట్స్ అందుకుంటున్నారు కొత్త దంపతులు. ప్రస్తుతం సునీత ఈటీవీలో నిర్వహించనున్న 'పాడుతా తీయగా' ప్రోగ్రాం హోస్ట్ గా వ్యవహారిస్తుంది. అలాగే పలు సినిమాలకు కూడా సాంగ్స్ పాడుతున్నట్లు తెలుస్తుంది.