Begin typing your search above and press return to search.
సునీతను ఎవరూ ఎంకరేజ్ చేయలేదా?
By: Tupaki Desk | 24 July 2016 7:30 AM GMTమనసులో అనుకునే మాటల్ని.. అనుకున్నట్లే ఓపెన్ గా మాట్లాడే తత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఒకవేళ మాట్లాడినా ఆచితూచి మాట్లాడతారే కానీ.. కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం అరుదు. తమ గురించి మాత్రమే కాదు.. అవతలివారి గురించి కూడా మరీ ఎక్కువగా మాట్లాడేవారు కనిపించరు. కానీ.. ఇందుకు భిన్నంగా సింగర్ సునీత వ్యవహరించారు. తాజాగా తన గురించి మాత్రమే కాదు.. ఇతర సింగర్స్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పేశారు. ఫ్రాంక్ గా మాట్లాడిన ఆమె మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి.
ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెను.. ‘‘సింగర్ గా 21 ఇయర్స్ ఇండస్ట్రీ.. కొత్తవాళ్లు వస్తున్నారు.. ఇన్ సెక్యూరిటీ లేదా? అన్న ప్రశ్న వేస్తే.. తనకు అలాంటిదేమీ లేదని.. కాన్పిడెన్స్ లేని వారికే ఇన్ సెక్యూరిటీ స్టార్ట్ అవుతుందన్న ఆమె.. మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘అప్పట్లో నేను.. కౌసల్య.. ఉష ఎక్కువ పాటలు పాడేవాల్లం. ఉషను ఆర్పీ పట్నాయక్.. కౌసల్యను చక్రి ఎంకరేజ్ చేశారు. నాకలా ఎవరూ ఉండేవారు కాదు. అప్పుడే ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడెందుకు వస్తుంది?’’ అని ప్రశ్నించారు. మరి.. మిమ్మల్ని అంటూ ఎంకరేజ్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందుకు సంపాదించుకోలేకపోయారన్న ప్రశ్నకు.. ఎవరు ఎవర్ని ఎంకరేజ్ చేయాలనే విషయంలో ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. ‘‘సింగర్ గా వచ్చినప్పుడు నేను మరీ చిన్నపిల్లను కాదు. మరీ పెద్దమ్మాయిని కాదు. చాలా చిన్న వయసులో పెళ్లి అయ్యింది. హౌ ఓల్డ్ యు ఆర్? అనేది ఎవరూ ఆలోచించరు. పెళ్లయితే ఓల్డ్ కింద జమ చేస్తారు. యూత్ ఫుల్ సాంగ్స్ ఇవ్వటానికి వెనకాడతారు. ఎంకరేజ్ మెంట్ గురించి పక్కన పెడితే.. నాకు అందరి మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పాడే ఛాన్స్ వచ్చింది. దాంతో ఒకరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏ వచ్చింది’’ అంటూ సమాధానం ఇచ్చారు. ఏది ఏమైనా.. సునీత చెప్పిన మాటలు మాత్రం ఆసక్తికరంగా మారాయని చెప్పొచ్చు.