Begin typing your search above and press return to search.
ఉదయభాను ఎపిసోడ్.. సునీత ఆన్సర్ అదే
By: Tupaki Desk | 19 Oct 2016 7:30 PM GMTఆ మధ్యన ప్రముఖ పేపర్ కు ఇంటర్యూ ఇచ్చిన ఉదయభాను.. అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పింది. ఒక ప్రముఖ సింగర్ తనను ఒక ఈవెంట్లో అవమానపరిచిందని.. కనీసం స్టేజీ మీదకు ఇన్వయిట్ కూడా చేయలేదని.. అలాగే తను స్టేజీ మీదకు వెళుతుంటే ఆ సింగర్ తాలూకు ఆర్కెస్ర్టా వారు శాడ్ మ్యూజిక్ ప్లే చేశారని.. చెప్పుకొచ్చింది. పేరు చెప్పలేదు కాని.. ఆనాడు తనకు కంట నీరు వచ్చేసిందని ఉదయభాను చెబితే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ సింగర్ ఎవరో కాదు సునీతే అంటూ తరువాత చాలా రూమర్లు వచ్చాయి. ఇప్పుడు ఆ సన్నివేశం గురించి స్వయంగా సునీతే చెప్పింది.
ఆ మధ్యన ఒక పేపర్లో ఉదయభాను చెప్పింది నా గురించే అని నాకు అర్ధమైంది. కాని తను నన్ను అపార్దం చేసుకుంది అంటూ తన ఎక్సప్లెనేషన్ ఇచ్చింది సునీత. ''చూడండి.. అది నా ప్రోగ్రామ్'' అనేసిన సునీత.. అయినా తనని నేను ఏమీ అనలేదు అంటూ స్వీట్ గా చెప్పింది. ''ఉదయభానును ఆర్గనైజర్లు పిలిచారు. నేను పిలువలేదు. కాబట్టి ఆమెను స్టేజ్ పైకి రమ్మని నేనెందుకు చెబుతాను? ఇక నా మ్యూజిక్ టీమ్ ఆమె వస్తున్నప్పుడు ఏదో శాడ్ సాంగ్ వాయించారని చెప్పింది. నాకు ఆ విషయం గుర్తులేదు. కాని తరువాత ఉదయభానును చాలాసార్లు నేను పలుకరించాను. ఆమె మాత్రం కటువుగా ఉండేది. మొన్న ఆ పేపర్లో నా పేరు వాడకుండా ఇంటర్యూ ఇచ్చినప్పుడు అర్ధమైంది.. ఆ సంఘటనను ఆమె మనస్సులో పెట్టుకుంది అని'' అంటూ సెలవిచ్చింది సునీత.
అంటే సునీత పిలవకపోవడం నిజమే. ఉదయభాను హర్టవ్వడం నిజమే. ఇక ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఎవరిది ఎంత తప్పు.. ఎవరిది ఎంత ఒప్పు అనేది వారికే తెలియాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/