Begin typing your search above and press return to search.
గాయని సునీతకు కరోనా? డీజీపీ-కేటీఆర్ కి ఫిర్యాదు!?
By: Tupaki Desk | 22 March 2020 5:48 AM GMTటాలీవుడ్ మేటి గాయని సునీతకు కరోనా పాజిటివ్ అన్న ప్రచారం ఉలిక్కిపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో ఈ ప్రచారం హోరెత్తిపోయింది. అయితే ఇది నిజమా? దీనిపై సునీత ఏమని స్పందించారు? అంటే అట్నుంచి సీరియస్ గానే ఉంది మ్యాటర్. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం కరోనా కల్లోలం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు కరోనా భారిన పడుతుండడంతో దానికి విస్త్రత ప్రచారం వచ్చేస్తోంది. ఇక సోషల్ మీడియాల్లో ఒక్కోసారి ఈ ప్రచారం అదుపు తప్పుతోంది. తప్పుడు ప్రచారంగా మారుతోంది. మొన్నటికి మొన్న ప్రముఖ హిందీ గాయని కనికా కపూర్ కోవిడ్ 19 భారిన పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె పలువురు రాజకీయ నాయకులతో కలిసి పార్టీలో ఉన్నప్పటి ఫోటోలు దుమారం రేపాయి. దానిపై నేతల సాక్షిగా విస్త్రతంగా ప్రచారమైంది.
ఇక కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం చేసిన కొన్ని వెబ్ మాధ్యమాలు.. సోషల్ మీడియా మాధ్యమాలు రాంగ్ ఫోటోని ఉపయోగించడం కల్లోలరం రేపింది. కనిక ఫోటో బదులుగా గాయని సునీత ఫోటోని బ్లర్ చేసి ఉపయోగించేయడంతో అది కాస్తా కలకలం రేపింది. ఇక సునీత ఈ విషయంలో ఎంతో సీరియస్ అయ్యారు. తనపై జరిగిన దుష్ప్రచారానికి కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ డీజీపీ సహా కేటీఆర్ ని సునీత కోరారు. సోషల్ మీడియాల్లో ఆ మేరకు ఆ ఇద్దరికీ టచ్ లోకి వెళ్లడం సంచలనమైంది. తన పరిస్థితిని వివరించి.. సహాయం చేయమని తెలంగాణ డిజిపి సహా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సునీత సంప్రదించారు. తరువాత ఆమె మంత్రి కెటిఆర్ ఖాతాకు తన వ్యథను ట్యాగ్ చేసి సాయం చేయాలని కోరారు.
సమాచారాన్ని వక్రీకరించి దుర్వినియోగపరిచి ప్రచారం చేస్తే సైబర్ నేరం గా పరిగణించి శిక్షార్హుల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ - ఎఫ్ బీ- ట్విట్టర్- వాట్సాప్ మాధ్యమం ఏదైనా తప్పుడు ప్రచారానికి శిక్ష తప్పదన్న ప్రచారం సాగుతోంది. గాయని సునీతపై దుష్ప్రచారంపై .. ఇంకా డీజీపీ మంత్రులు స్పందించాల్సి ఉంది.