Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ గాయ‌ని సునీత కుమారుడు హీరోగా

By:  Tupaki Desk   |   2 July 2023 10:03 AM GMT
సీనియ‌ర్ గాయ‌ని సునీత కుమారుడు హీరోగా
X
ప్రముఖ తెలుగు గాయని సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. లెజెండరీ ఫిల్మ్ మేకర్ కె రాఘవేంద్రరావు ప్రస్తుతం తన ఆర్‌.కె టెలిఫిల్మ్ షో బ్యానర్ పై `సర్కారు నౌకరి` అనే కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ గంగామౌని దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పీరియడ్ డ్రామాతో సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నార‌ని తెలిసింది.

గత కొంత కాలంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్త‌వుతోంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదలైంది. థియేటర్ ఆర్టిస్ట్ భావన వాజపండల్ ఇందులో నాయికా ప్రధాన పాత్రలో న‌టిస్తున్నారు. ఆమె చేరిక‌ ప్రాజెక్ట్ పై ఆస‌క్తిని పెంచింది. ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌గా ఆస‌క్తిని పెంచింది. ఫ‌స్ట్ లుక్ బ్యాక్ గ్రౌండ్ లో చెట్టుపై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వేలాడుతూ క‌నిపించ‌గా.. సైకిల్ పై ఉన్న హీరో లుక్ ని ప్రదర్శించారు. పెట్టెపై `పెద్ద రోగం చిన్న ఉపాయం` అని రాసి ఉంది. ఆకాష్ తన సహజమైన లుక్స్ తో ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రంలో వెట‌ర‌న్ న‌టుడు తనికెళ్ల భరణి కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. సూర్య- సాయి శ్రీనివాస్ వడ్లమాని- మణిచందన- రాజేశ్వరి ముళ్లపూడి- రమ్య కొల్హారి- త్రినాథ్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సీనియ‌ర్ గాయ‌ని సునీత వంద‌లాది పాట‌ల‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన ముద్ర వేసిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో పాపుల‌ర్ సింగింగ్ రియాలిటీ షోల జ‌డ్జిగాను క‌నిపించారు. సునీత‌కు హీరో అంత ఎదిగిన కుమారుడు ఉన్నాడ‌ని తాజా ప్ర‌క‌ట‌న‌తో అభిమానుల్లో మ‌రింత‌ విస్త్ర‌తంగా ప్ర‌చార‌మ‌వుతోంది.