Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కేంద్రుడి నిర్మాణంలో హీరోగా సింగ‌ర్ సునీత త‌న‌యుడు!

By:  Tupaki Desk   |   26 Jan 2023 1:52 PM GMT
ద‌ర్శ‌కేంద్రుడి నిర్మాణంలో హీరోగా సింగ‌ర్ సునీత త‌న‌యుడు!
X
వెండితెర‌పై వార‌సుల హ‌వా కొన‌సాగుతోంది. తాజ‌గా మ‌రో వార‌సుడు వెండితెర‌పై అరంగేట్రం చేయ‌బోతున్నాడు. ఎన్నో సినిమాల్లో మ‌దుర గాయ‌నిగా త‌న గానామృతాన్ని అందించి.. ఎంత మంది హీరోయిన్ ల‌కు డ‌బ్బింగ్ చెప్పి వారి పాత్ర‌ల‌కు వ‌న్నె తెచ్చిన పాపుల‌ర్ సింగ‌ర్ సునీత త‌న త‌న‌యుడు ఆకాష్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తోంది. ఈ మూవీకి ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్‌.కె. టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై ఆయ‌న ఈ మూవీని నిర్మిస్తున్నారు.

'స‌ర్కారు నౌక‌రి' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ద్వారా గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్స‌వ‌ పూజా కార్య‌క్ర‌మాల‌ని సంస్థ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

ఈ విభిన్న‌మైన సినిమా ద్వారా గాయ‌ని సునీత త‌న‌యుడు హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌గా, హీరోయిన్ గా నూత‌న న‌టి భావ‌నా వ‌ళ‌పండ‌ల్ ప‌రిచ‌యం అవుతోంది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌వు స‌న్నివేశానికి జీ స్టూడియోస్ నిర్మాత ప్ర‌సాద్ నిమ్మ‌కాయ‌ల కెమెరా స్విఛాన్ చేశారు.

దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్రరావు దేవుడి పటాలపై క్లాప్ నిచ్చారు. మ్యాంగో మీడియా అధినేత‌, గాయ‌ని సునీత భ‌ర్త రామ్ వీర‌ప‌నేని గౌర‌వ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. అనంత‌రం హీరో, హీరోయిన్ ల‌పై చిత్రీక‌రించిన తొలి షాట్ కు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, గాయ‌ని సునీత కెమెరా స్విఛాన్ చేశారు.

ఫిబ్రవరి 6 నుంచి నిరవధికంగా షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఆకాష్, భావనా వళపండల్,తనికెళ్ల భరణి,సూర్య,సాయి శ్రీనివాస్ వడ్లమాని,మణిచందన,రాజేశ్వరి ముళ్లపూడి,రమ్య పొందూరి, త్రినాథ్ నటీనటులు.

ఈ సినిమాకు మ్యూజిక్ : శాండిల్య ఆర్ట్ డైరెక్టర్ : రవి, కో డైరెక్టర్ : రమేష్ నాయుడు దళే, కాస్ట్యూమ్ డిజైనర్ : రితీషా రెడ్డి, నిర్మాణం : ఆర్.కె టెలీషో ప్రైవేట్ లిమిటెడ్సి నిమాటోగ్రఫీ - రచన - దర్శకత్వం : గంగనమోని శేఖర్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.