Begin typing your search above and press return to search.
సింగర్ సునీత షాకిచ్చిందిగా..!
By: Tupaki Desk | 24 Nov 2017 5:16 AM GMTతెలుగు సెలబ్రిటీలు రెండు రకాలు. ఒకరు తరచూ వార్తల్లో కనిపించే వారు. మరొకరు వార్తల్లో అప్పుడప్పుడు కనిపించే వారు. సింగర్ సునీత రెండో పక్షానికి చెందిన వారు. ఈ రెండు కోవకు చెందిన తెలుగు సెలబ్రిటీల్లో ఉన్నది ఉన్నట్లుగా కానీ.. నిష్ఠూరంగా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ పెదవి విప్పే వారు దాదాపుగా లేరనే చెప్పాలి. ఇక.. సినిమా సెలబ్రిటీలలో అలాంటి బ్యాచ్ కనిపించదు. నిత్యం వివాదాలతో కాలం గడిపే వర్మ లాంటి ఎక్ ట్రార్డినరీ కేసుల్ని పక్కన పెడితే.
సైలెంట్ గా ఉంటూ.. తన పని తప్ప పక్కింటోడి పని గురించి ఎప్పుడూ మాట్లాడని సింగర్ సునీత.. తాజాగా తన పోస్ట్ తో ఒక్కసారి వార్తల్లోకి వచ్చేశారు. ఏంది.. సింగర్ సునీత ఇంత మాట అందా? అంటూ ఇప్పుడామె వంక చూడాల్సిన పరిస్థితి. పెద్ద పెద్ద మగమహారాజులు సైతం కేసీఆర్ సర్కారుపై కించిత్ వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడని వేళ.. తన ఓపెన్ పోస్ట్ తో ఒక్కసారిగా షాకిచ్చారు.
ఇంతకీ సింగర్ సునీత పోస్ట్ చేసిన షాకింగ్ పోస్ట్ ఏందంటే.. హైదరాబాద్ రోడ్ల గురించి ఏ ప్రముఖుడూ టచ్ చేయని రీతిలో టచ్ చేసేశారు. ట్రంప్ కూతురు ఇవాంక రాయదుర్గం - ఖాజా గూడ రోడ్డు గుండా రావటం లేదేమో? వస్తే బావుండు అంటూ సింఫుల్ గా.. సుత్తి లేకుండా.. సూటిగా చెప్పాల్సింది చెప్పేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేశారు.
ఇవాంక పర్యటించే ప్రాంతాలన్నీ కొంగొత్తగా.. అసలు ఆ రోడ్లు ఉన్నది హైదరాబాద్ లోనేనా అన్నట్లుగా తళతళ మెరవటం.. రోడ్డు మధ్యలో పూల మొక్కలు.. పెయింటింగ్స్ తో అదరగొట్టేస్తున్న వేళ.. సునీత చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన పోస్ట్ పై పలువురు స్పందిస్తున్నారు. తెలంగాన రాష్ట్ర ప్రభుత్వంపై చురకలు వేస్తున్నారు. ఎప్పుడూ తన దారిన తాను అన్నట్లుగా ఉండే సింగర్ సునీతేనా.. ఇలా పోస్ట్ చేసిందనిపించేలా ఆమె పోస్ట్ ఉందంటున్నారు.
నిజానిజాల్లోకి వెళితే.. ఇవాంక ప్రయాణించే రోడ్ల కోసం దాదాపు రూ60 కోట్లను ఖర్చు చేసింది కేసీఆర్ సర్కారు. అయితే.. ఈ విషయం మొదట్లో మీడియాలో వచ్చినప్పుడు పెద్దగా పట్టించుకోని మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి నేపథ్యంలో.. రోడ్లు వేస్తోంది ఇవాంక కోసం కాదని.. ప్రజల కోసమని వ్యాఖ్యానించారు. మంత్రి కేటీఆర్ నోటి నుంచి మాట వచ్చిన కొద్ది రోజులకే తెలంగాణ అధికారపక్షానికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా తన వ్యంగ్య పోస్టుతో సునీత షాకిచ్చిందని చెప్పాలి. ఏమైనా సునీత గట్స్‌ను చూసి తెలుగు సినీ ప్రముఖులు ఆశ్చర్యపోవటం ఖాయం.