Begin typing your search above and press return to search.

ఇప్పటికి ఆయన ఆదాయం.. ఆస్తుల గురించి తెలియదు: సునీత

By:  Tupaki Desk   |   12 Aug 2021 3:20 AM GMT
ఇప్పటికి ఆయన ఆదాయం.. ఆస్తుల గురించి తెలియదు: సునీత
X
సింగర్ సునీత మొదటి పెళ్లి విషయం నుండి మొదలుకుని రామ్‌ వీరపనేని ని రెండవ పెళ్లి చేసుకునే వరకు ఆమె జీవితంలో ఎన్నో చేదు సంఘటనలు ఉన్నాయి. ఆమె జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు.. చిత్కారాలు.. విమర్శలు అన్నీ ఇన్నీ కావు. సింగిల్‌ పేరెంట్‌ గా ఇద్దరు పిల్లలను తీర్చి దిద్దే క్రమంలో కూడా ఆమె పలు అనుమానాలను ఎదుర్కొన్నారు. సింగిల్ గా ఉంటుంది అనగానే ఎవరికి వారు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉండేవారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత ఎదుర్కొన్న అవమానాల గురించి పేర్కొంది. ముఖ్యంగా రామ్‌ ను పెళ్లి చేసుకోవడానికి ముందు సునీత సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొందట. ఇక రామ్ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయిన సమయంలో కూడా ఆమెను ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారట.

సునీత తాజా ఇంటర్వ్యూలో తనను విమర్శించిన వారి గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రామ్ ను వివాహం చేసుకుంటున్నట్లుగా ప్రకటించిన సమయంలో సునీత ఆయన్ను డబ్బు కోసం పెళ్లి చేసుకుంటుంది అంటూ ఆరోపించారు. అతడికి ఉన్న ఆస్తిని చూసి సునీత పెళ్లి చేసుకుందని.. కాస్త ఆలస్యం అయిన సునీత బిగ్ పార్టీనే పెళ్లి చేసుకుంటుంది అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సోషల్‌ మీడియా కథనాలు మరియు పుకార్లు నాకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. నాకు రామ్‌ 15 ఏళ్లుగా తెలుసు. ఆయన యొక్క వ్యక్తిత్వం నాకు బాగా తెలుసు కనుకే నేను ఆయన్ను పెళ్లి చేసుకున్నాను. అంతే తప్ప ఆయన ఆస్తి గురించి కాదు.

మీరు చెప్తే నమ్మరు కాని ఇప్పటి వరకు రామ్‌ ఆస్తి ఎంత.. ఆయన వ్యాపారాలు ఏంటీ ఆయన సంవత్సరం టర్నోవర్‌ ఎంత అనే విషయాలు ఏవీ కూడా నాకు తెలియదు. ఇప్పటి వరకు కూడా నేను రామ్ తో ఆస్తుల గురించి మాట్లాడలేదు. మీడియాలో మాత్రం ఇష్టానుసారగంగా వార్తలు రాసేస్తున్నారు. రామ్‌ లో నిజాయితీని చూసి ఇష్టపడ్డాను. ఆయన ప్రతి విషయంలో కూడా సింపుల్‌ గా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం ఏర్పడిందని సునీత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మా వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందంటూ సునీత చెప్పుకొచ్చారు.