Begin typing your search above and press return to search.

సింగర్ల పరువు తీయకండి నాయనలారా

By:  Tupaki Desk   |   13 Aug 2016 4:13 AM GMT
సింగర్ల పరువు తీయకండి నాయనలారా
X
స్టేజీ మీద మాంచి సింగర్లతో పాటలు పాడించడం ఏమో గాని.. ఈ ఆడియో ఫంక్షన్లలో చాలాసార్లు వారి పరువు పోతోంది. ఎవ్వరు ఏమనుకున్నా కూడా.. ఈ సింగర్లను ఎక్కడి నుండో తేవడం.. ఇక్కడ కేవలం ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ ద్వారా ప్లే అవుతున్న సాంగుకు కేవలం పెదాలు కలుపుతూ స్టేజీ మీద యాక్ట్ చేయమనడం.. ఎందుకు ఈ ఎబ్బెట్టు పనులు? జనాలకు ఏం జరుగుతుందో తెలిసిపోయింది కాబట్టి.. ఇలాంటివి ఎవాయిడ్ చేస్తేనే బెటర్.

ఫర్ సప్పోజు గత రాత్రి జరిగిన 'జనతా గ్యారేజ్' ఆడియో ఫంక్షన్నే తీసుకుంటే.. అక్కడకు నేహా బాసిన్ ను ఇన్వయిట్ చేశారు. గతంలో ఊసరవెల్లి సినిమాలో నిహారిక సాంగు పాడిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో కూడా ఒక పాట పాడింది. అయితే ఆ పాటను స్టేజీ మీద పాడేటప్పుడు కేవలం గొంతుతో యాక్ట్ చేస్తోందని ఆమె లిప్ సింక్ చూస్తే తెలుస్తుంది. అంతేకాదు.. పాట పూర్తయ్యాక ఆమె మాట్టాడదాం అంటే.. అసలు ఆ మైకు పనిచేస్తేగా. అప్పటివరకు స్విచ్చాఫ్‌ చేసున్న మైకులో ఎలా పాడిందో ఏంటో. ఇంతకంటే ఫ్యూజులు పోయే మ్యాటర్ ఇంకోటి జరిగింది.

దేవిశ్రీప్రసాద్ తమ్మడు సాగర్ తో కలసి స్టేజెక్కిన శ్రావణ భార్గవి.. జనతా గ్యారేజ్ సినిమాలో 'పక్కా లోకల్' అనే పాటను పాడింది. అమ్మడిని చూడగానే.. మొన్న జూలై ఫస్టు వీక్ లో పాప పుట్టింది అన్నారు.. అప్పుడే ఆమె ఇలా చురుకుగా పాటలు పాడటానికి కూడా వచ్చస్తోందా అనుకున్నారు. అయితే ఓ నిమిషం పాట విన్నాక మాత్రం మైండ్ బ్లాంకే. ఎందుకంటే స్టేజీ మీద పాడుతుంది శ్రావణ భార్గవి అయితే.. మనకు వినిపిస్తోంది మాత్రం గీతా మాధురి గొంతు. అంతలా శ్రావణ భార్గవి గొంతు మార్చి పాడిందా? ఛస్ ఆగండి.

ఇందుమూలంగా చెప్పొచ్చేదేంటంటే.. అలా అనవసరంగా స్టేజీల మీద సింగర్లతో యాక్టింగ్ చేయించి.. పరువు తీయకండయ్యా. ప్లీజ్.