Begin typing your search above and press return to search.

బాలుకు ప్రేమ‌తో మ్యుజీషియ‌న్స్ స్వ‌ర‌నీరాజం

By:  Tupaki Desk   |   2 Jun 2022 12:30 PM GMT
బాలుకు ప్రేమ‌తో మ్యుజీషియ‌న్స్ స్వ‌ర‌నీరాజం
X
తెలుగు పాట‌కు వ‌న్నె తెచ్చిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం. తెలుగు పాట అంటే బాలు..ఆయ‌న స్వ‌రం నుంచి జాలువారిన పాట‌లు ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గీతాలుగా కోట్లాది మంది హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాయి. 50 ఏళ్ల బాలు సినీ ప్ర‌యాణంలో బాలు ఎన్నో వేల గీతాల‌ని ఆల‌పించారు. అలాంటి బాలుకి ప్రేమ‌లో అంటూ సినీ మ్యుజీషియ‌న్స్ బృందం జూన్ 4న ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం జ‌యంతిని పుర‌స్క‌రించుకుని స్వ‌ర‌నీరాజం అందించ‌బోతున్నారు. ర‌వీంద్ర భార‌తిలో ఈ కార్య‌క్ర‌మాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో దాదాపు 100 మంది సినీ మ్యుజీషియ‌న్స్ బాలు పాపుల‌ర్ పాట‌లతో ప్ర‌త్యేక క‌చేరీని నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని సినీ మ్యుజీషియ‌న్స్ గౌర‌వాధ్య‌క్షులు ఆర్ పి ప‌ట్నాయ‌క్ వెల్ల‌డించారు. `బాలుగారంటే మా అంద‌రికి ప్రాణం. మా అంద‌రికీ జీవితాన్ని ఇచ్చిన వ్య‌క్తి. జూన్ 4న ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ వేడుక‌ని ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు 12 గంట‌ల పాటు సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నాం. బాలుగారి పెట్టిన రోజుని క‌న్నుల పండుగ‌గా సెల‌బ్రేట్ చేయ‌బోతున్నాం` అని ఆర్పీ ప‌ట్నాయ‌క్ తెలిపారు.

సినీ మ్యుజీషియ‌న్స్ ప్రెసిడెంట్ విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ ` 30 ఏల్ల చ‌రిత్ర ఉన్న మా సినీ మ్యుజీషియ‌న్స్ యూనియ‌న్ లో 1500 మంది స‌భ్యుల‌కు పైగా వున్నారు. కొత్త సింగ‌ర్స్ అవుతామ‌నుకునే వారికి సినీ మ్యుజీషియ‌న్స్ కి మా యూనియ‌న్ తొలి మెట్టు. సినిమా, టీవి, ఓటీటీ ఇలా ఎక్క‌డ ప‌నిచేసినా వారికి మా సంస్థ త‌రుపున పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తాం. 2019లో యూనియ‌న్ స‌భ్యుల కోసం ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. ఈ కార్య‌క్ర‌మానికి వెన్నుద‌న్నుగా నిలిచి కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యేలా చేశారు బాలు గారు. అలాంటి వ్య‌క్తిని దుర‌దృష్ట వ‌శాత్తు కోల్పోయాం` అన్నారు.

తెలుగు పాట‌కు నిలువెత్తు సంత‌కం బాలు గారు. వారు లేరు అని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఆయ‌న మాతోనే వుండి మ‌మ్మ‌ల్ని న‌డిపిస్తున్నారు. కాబ‌ట్టి వాని జ‌న్మ‌దినాన్ని పెద్ద పండ‌గ‌లా చేస్తున్నాం. ఇంత పెద్ద పండ‌గ‌ను చేసుకోవ‌డానికి మాకు అవ‌కాశం క‌ల్పించిన సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని సియం యు ట్రెజ‌ర‌ర్ ర‌మ‌ణ శీలం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సింగ‌ర్ కౌస‌ల్య‌, శ్రీ‌రామ‌చంద్ర‌, వైస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన‌బోతున్నారు.