Begin typing your search above and press return to search.
మిలియన్ డాలర్ క్లబ్ వైపు సింగరాయ్
By: Tupaki Desk | 29 Dec 2021 5:03 AM GMTనేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ పాజిటివ్ మౌత్ టాక్ తో వసూళ్ల పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సమీక్షకులు పాజిటివ్ సమీక్షలతో ఎంకరేజ్ చేయడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సహా అమెరికాలోనూ నాని హవా కొనసాగుతోంది. ఓవైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప మూడో వారానికి చేరువలో చక్కని వసూళ్లను సాధిస్తున్నా.. నానీ సింగరాయ్ కి ఎలాంటి డోఖా లేదు. పుష్ప జోరు కొనసాగుతున్నా సింగరాయ్ కి అది ఎంతమాత్రం అడ్డంకి కాలేదు.
రెండవ వారంలో సింగరాయ్ కి 20 పైగా కొత్త థియేటర్లు జోడించనున్నామని అమెరికా పంపిణీ వర్గాలు ప్రకటించాయి. USAలో ఇప్పటికే దాదాపు 200 ప్లస్ థియేటర్లు(అద్భుతమైన హోల్డోవర్లు) లో ఆడుతోంది. ఇకపై అదనంగా థియేటర్లను పెంచనున్నారు. ఇప్పటికే 600కె డాలర్లు వసూలు చేసి వన్ మిలియన్ క్లబ్ వైపు పరుగులు పెడుతోంది.
శ్యామ్ సింగరాయ్ కి నాని నటన సాయిపల్లవి క్లాసికల్ అప్పియరెన్స్.. కృతి లిప్ లాక్ లు పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా సింగరాయ్ క్యారెక్టర్ బాగా పండింది. ఆ క్రమంలోనే వసూళ్లలో జోరు కనబరుస్తోంది. మిక్కీజే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ విడుదల చేసారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.