Begin typing your search above and press return to search.
సింగం-3.. ఓ 100 కోట్లేసుకోవచ్చా
By: Tupaki Desk | 17 July 2016 9:51 AM GMTహాలీవుడ్లో.. బాలీవుడ్లో ఒక సినిమా హిట్టయిందంటే.. వరుసబెట్టి సీక్వెల్స్ తీసేయడం మామూలే. తొలి భాగం కంటే తర్వాతి భాగాలు మరింత ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతుంటారు. వాటికి ఆదరణ కూడా బాగుంటుంది. కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఎందుకోగానీ సీక్వెల్స్ అచ్చిరావు. అటు తమిళంలో.. ఇటు తెలుగులో సీక్వెల్స్ చాలావరకు ఫ్లాపే అయ్యాయి. ఐతే ఒక్క ‘సింగం’ సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు. ‘సింగం’ కంటే ‘సింగం-2’ ఇంకా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఈ సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న ‘ఎస్-3’ మీద అంచనాలు మరింత భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్లు చూస్తుంటే దిమ్మదిరిగిపోతోంది.
ఆల్రెడీ ‘ఎస్-3’ తెలుగు వెర్షన్ హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడవడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయి. రూ.41 కోట్లకు ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది ఓ సంస్థ. అంటే అప్పుడే లెక్క రూ.60 కోట్ల దాకా వెళ్లిపోయింది. ఇంకా కేరళ.. కర్ణాటక.. నార్త్.. ఓవర్సీస్ హక్కుల సంగతి తేలాల్సి ఉంది. రెండు వెర్షన్ల శాటిలైట్ హక్కులు ఈజీగా రూ.20 కోట్ల కంటే ఎక్కువకు పలికే అవకాశముంది. ఇంకా ఆడియో హక్కులు.. ఎక్సట్రా ఉంటాయి. సింగం సిరీస్ లో తొలి రెండు సినిమాలూ వేరే భాషల్లో రీమేకయ్యాయి. ఇది కూడా వేరే భాషలకు వెళ్లే అవకాశముంటుంది. కాబట్టి మొత్తంగా ‘ఎస్-3’ లెక్క రూ.100 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయం. సూర్య కజిన్ జ్నానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హరి దర్శకుడు.