Begin typing your search above and press return to search.

మూడో సింహం ఏమైందసలు?

By:  Tupaki Desk   |   6 March 2017 6:34 AM GMT
మూడో సింహం ఏమైందసలు?
X
మూడు వారాల కిందట తమిళ.. తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది సూర్య సినిమా ‘ఎస్-3’. ఈ చిత్రానికి రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. ఓపెనింగ్స్ కూడా దానికి తగ్గట్లే వచ్చాయి. మాస్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నట్లే కనిపించింది. ‘ఎ’ సెంటర్లలో సినిమా కొంత అటు ఇటుగా నడిచినా.. బి-సి సెంటర్లలో మాత్రం ఓపెనింగ్ వీకెండ్లో కలెక్షన్ల మోత మోగింది. రెండు భాషల్లో కలిపి కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం. రెండో వీకెండ్లో కూడా ‘ఎస్-3’ వసూళ్లు పర్వాలేదు. కానీ ఈ ఊపు ఆ తర్వాత కొనసాగలేదు. సినిమా హిట్ కేటగిరిలోకి చేరలేదు.

ఈ చిత్రానికి రెండు భాషల్లో కలిపి రూ.100 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ సినిమా బ్రేక్ ఈవెన్ కు రావాలంటే రూ.150 కోట్లకు పైనే వసూలు చేయాలి. కానీ ‘ఎస్-3’ రెండు భాషల్లో కలిపి రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. తెలుగులో ఈ చిత్రం మీద నిర్మాత మాల్కాపురం శివకుమార్ రూ.18-19 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టాడు. ఐతే సినిమాను ఒకటికి మూడుసార్లు వాయిదా వేయడం వల్ల బయ్యర్లు ముందు అనుకున్న ప్రకారం డబ్బులు కట్టకపోవడంతో ఆయన కూడా ఒప్పందం ప్రకారం నిర్మాతకు డబ్బులు ఇవ్వలేదని సమాచారం. ఇక ఈ సినిమా తెలుగులో రూ.12-13 కోట్ల మధ్య షేర్ రాబట్టింది. పాత రేట్లలో కోత పడి ఉన్నప్పటికీ ‘ఎస్-3’ కొంతమేర నష్టాలు మిగిల్చినట్లే తెలుస్తోంది.

ఐతే తమిళ వెర్షన్ తో పోలిస్తే తెలుగులో ఎంతో బెటర్ అంటున్నారు. గత కొన్ని సినిమాల నుంచి సూర్యకు తమిళంలో ఫాలోయింగ్ తగ్గిపోతోంది. కలెక్షన్లు పడిపోతున్నాయి. అతడి మార్కెట్ స్టామినా తగ్గుతోంది. ‘ఎస్-3’ విషయంలోనూ అలాగే జరిగింది. ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టిన వాళ్లందరూ నష్టపోయినట్లు సమాచారం. సినిమాను ముందు అనుకున్న ప్రకారం డిసెంబర్లో రిలీజ్ చేసి ఉంటే దాని రేంజే వేరుగా ఉండేదని.. అన్ సీజన్లో.. పైగా తమిళనాట సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో రిలీజ్ చేయడం దెబ్బ కొట్టిందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/