Begin typing your search above and press return to search.
సింగం-3 డిజాస్టరా?
By: Tupaki Desk | 4 April 2017 11:15 AM GMT‘సింగం’ అనగానే ఇటు హీరో సూర్యలో.. ఇటు దర్శకుడు హరిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఆ సిరీస్ లో చేసిన తొలి రెండు సినిమాలూ మంచి విజయం సాధించాయి. కాసుల వర్షం కురిపించాయి. దీంతో అదే ఊపులో మూడో ‘సింగం’ను కూడా తీసుకొచ్చేశారు. ‘24’ సినిమాతో ఆర్థికంగా దెబ్బ తిన్న సూర్య.. ఈసారి ‘సింగం-3’ని తనే నిర్మించి నాలుగు రాళ్లు వెనకేసుకుందామని చూశాడు. కాంబినేషన్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగింది. అన్ని హక్కులూ కలిపి రూ.100 కోట్లకు పైగా బిజినెస్ జరగడం విశేషం. రెండు భాషల థియేట్రికల్ రైట్స్ రూ.90 కోట్లకు పైనే పలికాయి. తాజాగా బయటికి వచ్చిన ‘ఎస్-3’ కలెక్షన్ల వివరాలు చూస్తే షాకవడం ఖాయం.
ఈ సినిమా రెండు భాషల్లో కలిపి ఫుల్ రన్లో వసూలు చేసింది రూ.60 కోట్ల లోపే. అంటే బయ్యర్ల పెట్టుబడిలో మూడింట రెండొంతులు మాత్రమే వసూలైందన్నమాట. అంటే ‘ఎస్-3’ని డిజాస్టర్ కింద లెక్కెయ్యాలి. సినిమాకు నెగెటివ్ టాక్ ఏమీ రాకున్నా.. ఓపెనింగ్స్ కూడా బాగున్నా... చివరికి రిజల్ట్ ఇలా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. డిసెంబర్లో రావాల్సిన సినిమాను ‘ధృవ’ కోసమని ఒకసారి.. ఇంకా ఏవో కారణాలు చెప్పి ఇంకో రెండుసార్లు వాయిదా వేయడం మైనస్ అయింది. ఫిబ్రవరిలో పరీక్షల సీజన్లో సినిమాను రిలీజ్ చేయడంతో వసూళ్లు బాగా దెబ్బ తిన్నాయి. తెలుగు వెర్షన్ హక్కులు రూ.18 కోట్లకు పైనే పలకగా.. ఫుల్ రన్లో వసూలు చేసింది 11 కోట్ల లోపే. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మాల్కాపురం శివకుమార్ కు ఈ చిత్రం కూడా పెద్ద పంచే ఇచ్చింది. తమిళనాట కూడా పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/