Begin typing your search above and press return to search.

ప్రభాస్ లేకుండా పాటేంటి? పూజ లేకుండా రొమాన్స్ ఏంటి?

By:  Tupaki Desk   |   22 Jan 2022 8:30 AM GMT
ప్రభాస్ లేకుండా పాటేంటి? పూజ లేకుండా రొమాన్స్ ఏంటి?
X
ప్రభాస్ అభిమానులంతా కూడా 'రాధేశ్యామ్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, టి - సిరీస్ వారు .. యూవీ క్రియేషన్స్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు. పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో, ఆ స్థాయిలోనే ఈ సినిమాను నిర్మించారు .. ఆ స్థాయిలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే అనుకున్నారు. అయితే కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో, ఆ ఆలోచనను విరమించుకున్నారు.

ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ .. పైగా విదేశాలలోనే కథ అంతా కూడా జరుగుతుంది. రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో పాటల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సినిమాలోనూ పాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి పాటను ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా మలిచినట్టుగా ప్రమోషన్స్ సమయంలో రాధాకృష్ణ కుమార్ చెప్పాడు కూడా. ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ లో నుంచి రొమాంటిక్ సాంగ్ లోకి వెళ్లవలసి ఉంటుంది. అయితే అలా సీన్ లో నుంచి సాంగ్ లోకి వెళదామని అనుకునే ఆలోచన చేసే సమయానికి పూజ వేరే సినిమాలతో బిజీ అయిపోయిందట. డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితి కూడా లేకపోయింది.

అయితే ఆ సందర్భంలో రొమాంటిక్ సాంగ్ పడితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు, గ్రాఫిక్స్ తోనే ఆ పాటను చేద్దామని ఫిక్స్ అయ్యారట. అలా ప్రభాస్ - పూజ ఇద్దరూ అవసరం లేకుండానే పూర్తిస్థాయి గ్రాఫిక్స్ తో ఒక పాటను రెడీ చేశారట. ఈ పాట ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని అంటున్నారు. క్లోజప్ షాట్స్ లో ప్రభాస్ .. పూజ కనిపిస్తారు గనుక, ఎక్కడా కూడా ఇది పూర్తిస్థాయి గ్రాఫిక్ వర్క్ తో చేశారనే డౌట్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు. ఒక రకంగా ఈ సినిమా పరమైన ప్రయోగాలలో ఇది ఒకటి అని అంటున్నారు.

ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కరోనా తీవ్రత తగ్గడం పైనే రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుందని అనుకోవాలి. ప్రభాస్ తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో కృష్ణంరాజు .. జగపతిబాబు .. సత్యరాజ్ .. మురళీశర్మ కనిపించనున్నారు. ఇదే ఏడాదిలో ప్రభాస్ నుంచి 'సలార్' .. 'ఆది పురుష్' రానున్నాయి. ఇక ఆ తరువాత ఆయన 'ప్రాజెక్ట్ K' .. ' స్పిరిట్' ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నాడు. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా లైన్లో ఉన్నాడు. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాల జాబితాలో వేసుకోవచ్చు.