Begin typing your search above and press return to search.
ఫొకస్: ఒక్క తప్పుతో అంతా రివర్స్
By: Tupaki Desk | 28 July 2015 7:55 PM GMTఒక్క అడుగు.. ఈ ఒక అడుగు ఒకోసారి విజయతీరాలకు చేర్చితుంది. కొన్నిసార్లు మాత్రం అనాలోచితంగానో, ఉద్దేశ్యపూర్వకంగానో తీసుకున్న నిర్ణయాలు పాతాళానికి పడేస్తాయి. మన సినీరంగంలోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నటులను, దర్శకులను మరి తిరిగి కోలుకోలేని స్థితికి చేర్చేశాయి కూడా.
ప్రియమణి.. ఈ చిన్నది ఎన్టీఆర్ తో యమదొంగ చేసేసరికి, కెరీర్ లో మంచి స్టేజ్ లోకి వచ్చింది. ఈ టైంలో నితిన్ తో కలిసి ద్రోణ మూవీలో సింగిల్ పీస్ బికినీతో.. ఓ సాంగ్ మొత్తం చేసింది. ఆ సినిమాలో ఈ సాంగ్ ఒకటే చూడబుల్ గా ఉంటుందనుకోండి. అంతే... ఆ తర్వాత ఈ సుందరాంగిలో చూడాల్సినవి, ఆమె చూపించేవి ఇంకేమీ లేవని అనుకున్నారనుంకుంటా డైరెక్టర్లు. మళ్లీ సరైన ఛాన్స్ ఒక్కటి కూడా రాలేదు ప్రియమణికి.
భాస్కర్.. ఈ పేరు చెబితే గుర్తుకురాకపోవచ్చు కానీ.. బొమ్మరిల్లు భాస్కర్ అంటే మాత్రం.. ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్. ఆ తర్వాత పరుగు కూడా కలెక్షన్ రేస్ లో గెలిచింది. వీటితో ఎంత ఫేమస్ అయ్యాడో.. రామ్ చరణ్ తో ఆరెంజ్ ఫ్లాప్ ఇచ్చాక.. అంతకు పది రెట్లు బద్నామ్ అయిపోయాడు. సహజంగా ఇంతటి షాక్ ఇచ్చినవారికి రెండో ఛాన్స్ కష్టం. కానీ మనోడికి ఒంగోలుగిత్త చేసే అవకాశం వచ్చింది. అది కూడా సూపర్ డూపర్ బంపర్ ఫ్లాప్ కావడంతో.. ఇండస్ట్రీలో భాస్కర్ పేరు వినిపించడం మానేసింది.
ఇలాంటిదే కాకపోయినా... దీనికి దగ్గరగానే ఉంటుంది మెహెర్ రమేష్ స్టోరీ కూడా. కంత్రీతో యావరేజ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. అయితే ప్రభాస్ తో బిల్లా తీసిన విధానం బాగుందని భావించిన ఎన్టీఆర్... శక్తి ఇచ్చాడు. ఆ సినిమాతో మెహెర్ ఇచ్చిన షాక్.. ఎన్టీఆర్ కి కూడా బాగానే కొట్టింది. తర్వాత షాడో అంటూ... వెంకటేష్ కి ఇంటిపేరుగా మారిపోయిన విక్టరీని... ఆయన మర్చిపోయేలా చేశాడు. ఈ దెబ్బతో... మెహెర్‌ని మర్చిపోయారు అందరూ.
ఫ్లాపులందు సూపర్ ఫ్లాపులు వేరయా అన్నట్లుంది వీళ్ల పరిస్థితి. ఒకోసారి చేసిన తప్పు చూపే ఫలితం... జీవితాలను తలకిందులు చేసేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మరి.