Begin typing your search above and press return to search.
పైరసీని పెంచే స్కీమ్ కి సాయం చేస్తారా?
By: Tupaki Desk | 30 Nov 2015 6:45 AM GMTథియేటర్ లలో టిక్కెట్టు పెంపు ప్రతిసారీ రచ్చ కెక్కుతూనే ఉంది. మరోసారి అలాంటి రచ్చకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సామాన్యుడికి ఇక వినోదం అందని మావి అవుతుందని ఇండస్ర్టీలో ముచ్చటించుకోవడం విశేషం. ఇక నుంచి మల్టీప్టెక్సుల్లో టిక్కెట్టు ధరకు సమానంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో టిక్కెట్టు ధరలను పెంచేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకూ సింగిల్ స్ర్కీన్లలో కేవలం 10 రూపాయల టిక్కెట్టు ధర ఉండేది. ఈ రేటు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేది.
కానీ.. ఇప్పుడు రూ.30కి పెంచేస్తున్నారని సమాచారం. అలాగే రూ. 70 నుంచి రూ.80 మధ్య ఊగిసలాడుతున్న రిజర్వ్‌డ్ క్లాస్ టిక్కెట్టు ధరని 125 రూపాయలకు పెంచేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే థియేటర్ల ఓనర్లు నేరుగా తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక ఇండస్ర్టీని బొంద పెట్టినట్టే.
ఇప్పటికే ఓపెనింగుల్లేక స్టార్ హీరోలే అల్లాడిపోతున్నారు. మునుముందు చిన్న సినిమా అనేది నామరూపాల్లేకుండా పోయే దారుణమైన పరిస్థితి వచ్చేస్తుంది. ఓ సామాన్యుడు కుటుంబ సమేతంగా థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఉందిప్పుడు. మల్టీప్లెక్సులకైతే కనీసం ఆ దరిదాపుల్లోకే వెళ్లలేని ధైన్యం ఉంది. అసలే మార్కెట్ లో ప్రతి వస్తువు ధర దారుణంగా పెరిగి సామాన్యుడి నడ్డి విరిచేస్తుంటే కనీసం వినోదం అందకుండా చేసేందుకు కుట్ర సాగుతోంది. ఇలా టిక్కెట్లు కొనే రిస్కు చేయలేకే చాలా మంది పైరసీని ఆశ్రయిస్తున్నారు. అంత దూరం వెళ్లి సినిమా ఎవరు చూస్తారు.
సినిమా కోసం 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు చేయాలంటే మాటలా? దానికంటే ఇంటర్నెట్ లో డౌన్ లోడ్ చేసుకుంటే పోలా? అనుకుంటున్నారంతా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం టిక్కెట్టు ధర పెంచి ఇతోధికంగా పైరసీ పెరగడానికి దోహదం చేస్తారా? లేక పేదోడి తరపున నిలబడి ప్రమాదం నుంచి పరిశ్రమని గట్టెక్కిస్తారా? అన్నది చూడాల్సిందే.