Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU ః అందరు అంటున్నారు.. నిజంగా ఇద్దరి మద్య ఉందా?

By:  Tupaki Desk   |   27 Sep 2021 5:32 AM GMT
#BIGGBOSS5TELUGU ః అందరు అంటున్నారు.. నిజంగా ఇద్దరి మద్య ఉందా?
X
బిగ్ బాస్‌ సీజన్ 5 నుండి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యి వెళ్లి పోయిన సరయు స్టేజ్ పై నాగార్జున పక్కన నిల్చుని షణ్ముఖ్‌ జష్వంత్‌ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిరి మరియు షణ్నులు ఇద్దరు కలిసి గేమ్‌ ఆడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు కూడా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ ఇద్దరు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఉన్నారని సరయు చెప్పుకొచ్చింది. బజ్ ఇంటర్వ్యూలో కూడా అమ్మాయిలను అడ్డు పెట్టుకుని గేమ్‌ ఆడటం ఏంట్రా .. చేతులకు గాజులు వేసుకో అంటూ తీవ్ర వ్యాఖ్యలను షణ్ను గురించి సరయు చేసింది. ఆమె వ్యాఖ్యలతో సిరి మరియు షణ్నుల మద్య ఏమైనా ఉండి ఉంటుందా అంటూ కొందరికి అనుమానం కలిగింది. కాని ఎక్కువ శాతం మంది మాత్రం వారిద్దరు ప్రొఫెషన్ పరంగా పరిచయం ఉండి ఉండవచ్చు కాని ఇద్దరు కూడబలుక్కుని గేమ్‌ ఆడట్లేదేమో అనుకున్నారు. రెండవ వారంలో ఎలిమినేట్ అయిన ఉమాదేవి కూడా మీరు ఇద్దరు ఎవరి ఆట వారు ఆడండి. ఇద్దరు కలిసి ఇతరులతో ఆడకండి అంటూ సీరియస్ గా చెప్పేసి వెళ్లింది. బజ్ లో కూడా షణ్ను గురించి తీవ్రంగానే ఉమాదేవి స్పందించింది. దాంతో ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా అనే అనుమానం మరింతగా మొదలైంది.

సరయు మరియు ఉమాదేవిలు చేసిన వ్యాఖ్యలతో షణ్ను ఏదో తేడా కొడుతుంది.. నేను సిరికి దూరంగా ఉంటాను అంటూ జెస్సీ తో చెప్పి ఆమెకు దూరం అయ్యేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నావు.. నాతో ఎందుకు మాట్లాడటం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంది. అయినా కూడా కరగని షణ్ను ఆమెతో పూర్తిగా కలిసి పోయి ఉండటం లేదు అనుకుంటూ ఉన్న సమయంలో వీకెండ్‌ లో ఎవరో ఏమో అనుకుంటున్నారని మీరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు.. సిరిని ఎందుకు ఏడిపిస్తున్నావు అంటూ షణ్నును నాగ్ మందలించాడు. దాంతో ఇద్దరు ఎవరేం అనుకుంటే ఏంటీ స్నేహంగా ఉందాం అనుకున్నట్లుగాను. తాజా ఎపిసోడ్‌ లో పక్క పక్కనే కూర్చున్నారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా అనిపించింది. లహరి వెళ్లి పోతున్న సమయంలో హౌస్ లోనే ఇకపై అయినా సిరి ఆటను ఫాలో అవ్వకుండా ఎవరి గేమ్‌ వారు ఆడండి అంటూ షణ్నుకు చెప్పింది.

స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత కూడా సిరి వేసిందనే తనను నామినేషన్ లో షణ్ను వేశాడు అంటూ లహరి పదే పదే గట్టిగానే అనేసింది. కాని షణ్ను మాత్రం ఆ విషయాన్ని కొట్టి పారేసేలా మాట్లాడాడు. వెళ్లి పోయిన ముగ్గురు ఆ మాట మాట్లాడటంతో పాటు ఇంట్లో ఉన్న ఇతర సభ్యుల్లో కూడా సిరి మరియు షణ్నులు కలిసి ఆడుతున్నారు అనే ఫీలింగ్ ఉంది. ఇద్దరు బయటకు కనిపించడం లేదు కాని ఖచ్చితంగా గేమ్ ప్లే ను కంటిన్యూ చేస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంట్లో క్లోజ్ గా చూసే వారు చెబుతున్నారు కనుక అందరు అదే విషయాన్ని అంటున్నారు కనుక నిజంగానే ఇద్దరి మద్య ఏమైనా నడుస్తుందా.. దాన్ని కలిసి గేమ్‌ గా ఇంప్లిమెంట్‌ చేస్తున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరు సోమవారం ఎపిసోడ్ నుండి ఎలా ఉంటారు అనేది చూడాలి. షణ్ను కు దీప్తి సునైన అంటే చాలా ఇష్టం. కనుక సిరితో స్నేహం తప్ప ప్రేమ ఉండదు. కనుక ఆ స్నేహంతో ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.