Begin typing your search above and press return to search.

సిరి శ్రీహాన్ కూడా బ్రేకప్‌!.. ఇదే సాక్ష్యం?

By:  Tupaki Desk   |   6 Jan 2022 4:06 AM GMT
సిరి శ్రీహాన్ కూడా బ్రేకప్‌!.. ఇదే సాక్ష్యం?
X
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 కంటెస్టెంట్స్ షన్నూ మరియు సిరిలు ఇద్దరు కూడా హౌస్‌ లో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరుకు అసంతృప్తితోనో లేదంటే మరేదో కారణమో కాని వారిద్దరి కాబోయే లైఫ్‌ పార్టనర్‌ అనుకున్న వారు బ్రేకప్‌ చెప్పేశారు. ఇప్పటికే షన్నూ కు దీప్తి బ్రేకప్‌ చెప్పేసింది.

ఆమె దుఖః దిగమింగుకుంటూ షన్నూ తో తాను తెగ తెంపులు చేసుకుంటున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఆ విషయంలో షన్నూ కూడా స్పందిస్తూ ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాను.. ఆమె ఇన్నాళ్లు నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అన్నట్లుగా పోస్ట్‌ పెట్టాడు. ఆమె పోస్ట్‌ కు షన్నూ స్పందించిన తీరు పోతే పో అన్నట్లుగా లైట్ తీసుకుంది అన్నట్లుగా ఉందంటూ కొందరు నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒక వైపు షన్నూ మరియు దీప్తిలు బ్రేకప్‌ అవ్వగా మరో వైపు సిరి మరియు శ్రీహాన్ ల విషయం గురించి కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బిగ్‌ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రియుడిని సిరి కలువలేదు అంటూ వార్తలు వచ్చాయి. బిగ్‌ బాస్ లో ఉన్న సమయంలో శ్రీహాన్ చాలా సపోర్ట్‌ గా సిరి కోసం ప్రచారం చేశాడు.

అంతగా చేసిన శ్రీహాన్ కు బిగ్‌ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కనీసం కలవలేదు అంటూ వార్తలు వచ్చాయి. ఇటీవల సిరి పుట్టిన రోజు.. ఆ సందర్బంగా శ్రీహాన్‌ సోషల్‌ మీడియాలో విషెష్‌ చెప్పాడు. అయినా కూడా ఆమె స్పందించలేదు. కనీసం అతడి పోస్ట్‌ ను షేర్‌ చేయలేదు. దాంతో ఇద్దరి మద్య దూరం పెరిగింది అంటూ అంతా అనుకున్నారు.

ఇప్పుడు అనుమానం మరింత నిజం అయ్యింది. శ్రీహాన్ తన సోషల్ మీడియా అకౌంట్‌ లో ఉన్న సిరి ఫొటోలు అన్నింటిని కూడా డిలీట్‌ చేశాడు. సిరి జ్ఞాపకాలు అన్నింటిని కూడా ఆయన చెరిపి వేయడంతో ఇక బ్రేకప్‌ ప్రకటన తరువాయి అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీహాన్‌ ఉన్నట్లుండి ఎందుకు ఫొటోలు డిలీట్ చేశాడు.. ఇదే బ్రేకప్ కు సాక్ష్యం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో శ్రీహాన్ నుండి ఏ క్షణంలో అయినా బ్రేకప్‌ పోస్ట్‌ లేదా వీడియో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఇద్దరి విషయంలో కూడా షన్నూ కు దీప్తి బ్రేకప్ చెప్పగా.. సిరి కి శ్రీహాన్ బ్రేకప్‌ చెప్పాడు. అంటే ఇద్దరు కూడా ప్లాన్‌ చేసుకుని మరీ బ్రేకప్‌ చెప్పేలా చేసుకున్నారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ నలుగురి నుండి ఎలాంటి ప్రకటనలు వినాల్సి వస్తుంది.. ఈ రెండు జంటలు ఎలాంటి టర్న్‌ తీసుకుంటాయి అనేది చూడాలి.