Begin typing your search above and press return to search.

రొమాంటిక్ పోస్టర్ తో #SIRISH6 అనౌన్సమెంట్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!

By:  Tupaki Desk   |   27 May 2021 5:30 AM GMT
రొమాంటిక్ పోస్టర్ తో #SIRISH6 అనౌన్సమెంట్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!
X
యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ 'శ్రీరస్తు శుభమస్తు' 'ఒక్క క్షణం' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా కంటెంట్ ఓరియెంటెడ్ నమ్ముకొని ముందుకు వెళ్తున్నాడు. అయితే యంగ్ హీరో కొత్త సినిమా కబురు వినిపించి చాలా రోజులైంది. 2019 సమ్మర్ లో వచ్చిన 'ఏబీసీడీ' తర్వాత ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవల 'విలాయటి శరాబ్‌' అనే హిందీ మ్యూజిక్ వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో శిరీష్ సీక్రెట్ గా ఓ సినిమా షూటింగ్ చేసేస్తున్నాడు. దీని కోసం పూర్తిగా తన మేకోవర్ చేంజ్ చేశాడు.

అల్లు హీరో ఈసారి తన తదుపరి సినిమా కోసం కొత్త తరం ప్రేమకథని సెలెక్ట్ చేసుకున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 6వ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించడానికి రెడీ అయ్యారు. తాజాగా #SIRISH6 ప్రాజెక్ట్ కి సంబంధించిన అనౌన్సమెంట్ ఇచ్చిన మేకర్స్.. ఓ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్ల ఫేస్ కనిపించకుండా.. చేతులు అడ్డుపెట్టి ముద్దు పెట్టుకుంటున్నారు. దీంతో ఇది ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అనిపిస్తోంది. ఈ బ్యూటిఫుల్ అనౌన్సమెంట్ ప్పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు #SIRISH6 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుపుకున్న
ఈ చిత్రంలో శిరీష్ సరసన గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ, ‘విజేత’ ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్‌ శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఫస్ట్ లుక్ తో ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించనున్నారు.