Begin typing your search above and press return to search.
వీడియో: 'శ్యామ్ సింగరాయ్' కోసం సిరివెన్నెల చివరి సంతకం..!
By: Tupaki Desk | 7 Dec 2021 11:39 AM GMTనేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''శ్యామ్ సింగరాయ్''.ఈ సినిమా కోసం లెజెండరీ లిరిసిస్ట్, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన చివరి పాట రాశారు. గీత రచయిత అంత్యక్రియలు జరిగిన రోజునే ఆ పాట రికార్డ్ చేయబడింది. ఆయనకు నివాళిగా ఈ గీతానికి 'సిరివెన్నెల' అనే పేరు పెట్టుకోవడమే కాకుండా.. ఈ పాటను సీతారామశాస్త్రికి అంకితం ఇస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.
'శ్యామ్ సింగరాయ్' చిత్రంలోని 'సిరివెన్నెల' పాట లిరికల్ వీడియోను ఈరోజు మంగళవారం సాయంత్రం చిత్ర బృందం విడుదల చేసింది. 'నెలరాజుని.. ఇలారాణి.. కలిపింది కదా సిరివెన్నెలా.. దూరమా.. తీరమై చేరుమా..' అంటూ సాగిన ఈ సోల్ ఫుల్ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. ఇది నాని - సాయి పల్లవిల స్నేహపూర్వక ప్రేమకథను తెలియజేస్తోంది. ఇద్దరూ రాత్రి సమయంలో మాత్రమే కలుసుకుంటూ.. రహస్యంగా బయటకు వెళ్లి వస్తున్నట్లు కనిపిస్తోంది.
'సిరివెన్నెల' పాటలో నాని - సాయి పల్లవిల క్లాస్ రొమాన్స్ మరియు అందమైన వింటేజ్ ప్రేమకథను చూడొచ్చు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ప్రేమ గాఢతను.. లోతైన అర్థాన్ని కలిగి ఉంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ గీతాన్ని యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి ఆకట్టుకునేలా ఆలపించారు. విజువల్ గా కూడా ఈ పాట మంచి ఫీల్ ని కలిగిస్తోంది.
సత్యదేవ్ జంగా ఒరిజినల్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రానికి సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. కృతి మహేష్ మరియు యష్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు.
'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇందులో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.